
‘కాటమరాయుడు’ సెట్స్ లోకి పవన్ కళ్యాణ్ ప్రవేశించాడని ఖరారు చేస్తూ… తెల్ల చొక్కా, పంచెలో టీ కప్పును పట్టుకుని ఉన్న ఫోటోను పోస్ట్ చేసాడు. ఈ ఫోటోను చూసిన అభిమానులకు ఇప్పటినుండే పండగ ప్రారంభమైనట్లుగా ఉంది. ‘ఫ్రిజ్ లో నుండి తీసిన పెరుగు కప్పు’లా ఫ్రెష్ లుక్ లో పవన్ కళ్యాణ్ ను చూసి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. ఇంతకు ముందు ‘సర్ధార్ గబ్బర్ సింగ్’ సినిమాలో లుక్ కంటే విభిన్నంగా, అందంగా ఉండడంతో పవన్ కొత్త లుక్ ఫ్యాన్స్ కు కావల్సినంత కిక్ ను పంచుతోంది.
అలాగే ఈ లుక్ తో ఇప్పటివరకు ఉన్న సందేహాలు కూడా వీడిపోయాయి. పవన్ ‘కాటమరాయుడు’ సినిమా, అజిత్ తమిళ చిత్రం ‘వీరమ్’కు రీమేక్ అని ఇప్పటివరకు ప్రచారం జరిగినప్పటికీ, ఈ విషయంపై ఎవరూ స్పందించలేదు. కానీ, ‘వీరమ్’లో అజిత్ లుక్ కూడా ఇలాగే తెల్లటి చొక్కా, పంచెతో ఉంటుందన్న విషయం తెలిసిందే. దీంతో నిర్మాత శరత్ మరార్ రీమేక్ విషయాన్ని పరోక్షంగా చెప్పకనే చెప్పాడు.
ఈ నెల 4న ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. కేరళలో ఈసారి కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ ఘన విజయం సాధించింది. మొత్తం…
అమెరికా-ఇరాన్ యుద్ధం ఇప్పట్లో ముగిసే సూచనలు కనిపించడం లేదు. ఆ కారణంగా ప్రపంచవ్యాప్తంగా చమురు సంక్షోభం క్రమంగా పెరుగుతోంది. కనుక…