Telugu

“కాటమరాయుడు” లీక్… సెంటిమెంట్ వర్కౌట్ అయ్యేనా..?

మార్చి 24వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ “కాటమరాయుడు”కు సంబంధించి ఓ భారీ లీక్ అయినట్లుగా నెట్టింట ప్రచారం జరుగుతోంది. ఈ సినిమా టీజర్ లో చూపించిన ట్రైన్ ఫైట్ లీక్ అయ్యిందని, అలాగే దానికి సంబంధించిన పలు ఫోటోలు కూడా లీక్ అయ్యాయని ఈ లీకేజ్ సారాంశం. అయితే ఈ లీకేజ్ ఎవరు చేసారన్నది? సమాధానం లేని ప్రశ్న అయితే కాదు.

నాటి ‘జల్సా, అత్తారింటికి దారేది’ సినిమాల మొదలుకుని, మొన్నటి ‘బాహుబలి 2’ వరకు విడుదలకు ముందే ఆన్ లైన్ లో ప్రత్యక్షమైన లీకులన్నీ ‘ఇంటి దొంగ’ల పనే అని తేలింది. లీకేజ్ అయిన కాసేపు హడావుడి చేయడం, ఆ తర్వాత మళ్ళీ తదుపరి సినిమాకు ఇదంతా మామూలు అయిపోవడం చూస్తూనే ఉన్నాం. ఒకప్పుడు లీకేజ్ అంటే పెద్ద సెన్సేషన్. కానీ, ఇప్పుడు అది రొటీన్ వ్యవహారంగా మారిపోయింది.

ADVERTISEMENT

నిజానికి కొందరు నిర్మాతలు అయితే దీనిని పబ్లిసిటీగా మార్చుకుంటున్నారు. అంతేకాకుండా ఈ లీక్ ల వలన ఒక్కోసారి సెంటిమెంట్ వర్కౌట్ అయ్యి, బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించిన సినిమాలు కూడా ఉన్నాయి. మరి ‘కాటమరాయుడు’ కూడా ఆ జాబితాలో చేరుతుందో లేదో గానీ, మరో నెల రోజుల్లో విడుదల ఉందనగా, హల్చల్ చేస్తోన్న ఈ లీకేజ్ వ్యవహారం ఇండస్ట్రీలో మరోసారి హాట్ టాపిక్ అయ్యింది.

ఇంటర్వెల్ కు ముందు వచ్చే ఫైట్ గా చెప్తున్న ఈ సీన్ విషయం ఏమో గానీ, యూ ట్యూబ్ లో పవన్ కు సంబంధించిన మరో వీడియో కూడా హల్చల్ చేస్తోంది. ఓ గ్రామంలో పవన్ కళ్యాణ్ సైకిల్ మీద వస్తుండగా, చుట్టూ ఉన్న కెమెరాలు పవన్ ను బంధించే పనిలో పడ్డాయి. ‘కాటమరాయుడు’ సినిమా కధ గ్రామీణ వాతావరణ నేపధ్యంలో సాగేదన్న విషయం, అజిత్ ‘వీరమ్’ చెప్పకనే చెప్పింది.

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

ప్రధాని మోడీకి జవాబు చెప్పలేని నిస్సహాయ స్థితిలో కేసీఆర్‌!

తెలంగాణ బిజేపి అధ్యక్షుడు రాంచందర్ రావు మూడు రోజుల క్రితం మీడియాతో మాట్లాడుతూ ప్రధాని మోడీ హైదరాబాద్‌ పర్యటనతో రాష్ట్ర…

8 minutes ago

Age is Just a Number: Modi’s ‘Superhuman’ May Sprint!

Prime Minister Modi’s relentless energy is the ultimate case study in discipline. Just days ago,…

29 minutes ago