
అయితే గత కొంతకాలంగా నిశ్శబ్దంగా ఉన్న కత్తి మహేష్ జోనర్ లోకి ఈ సారి ‘జబర్దస్త్’ ఫేం హైపర్ ఆది వచ్చాడు. అవును… బుల్లితెర త్రివిక్రమ్ గా పేరు గాంచిన హైపర్ ఆదికి అశేష అభిమానం ఉండగా, కత్తి మహేష్ కు మాత్రం ఆది స్కిట్స్ అంటే అసహ్య భావన వేయడం విశేషం. చీప్ కామెడీకి కేరాఫ్ అడ్రస్ గా హైపర్ ఆది స్కిట్స్ ఉన్నాయని, జబర్దస్త్ కూడా అలాగే ఉంటుందని, ఇలాంటి షోలను తాను అస్సలు చూడనని మండిపడ్డారు.
తన సన్నిహితుడు ఆది స్కిట్స్ బాగుంటాయని లింక్స్ పంపిస్తే, నాలుగైదు చూశానని, అవన్నీ రోతగా ఉన్నాయని, ఇలాంటివి చూసి నాగబాబు ఎలా నవ్వుతారో నాకర్ధం కాదని ఓ వీడియోను రూపొందించి ఫేస్ బుక్ లోకి వదిలారు. దీంతో మరోసారి కత్తి మహేష్ పేరు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. ఎక్కువమంది మెచ్చే వ్యక్తులను విమర్శించడం ద్వారా మహేష్ లైం లైట్ లో ఉండాలని ప్రయత్నిస్తున్నారంటూ నెటిజన్లు, పవన్ ఫ్యాన్స్ చేస్తోన్న కామెంట్స్ కు కొదవలేదు.
నిజానికి కత్తి మహేష్ చెప్పినట్లుగా… జబర్దస్త్ లో ఇతరులపై పంచ్ లు వేసి హాస్యం పండిస్తుంటారు. బుల్లితెర వరకు అది హాస్యాన్ని పంచుతోంది. ఒకవేళ పంచ్ లు వేసినా వాటిని లైట్ గా తీసుకోవాలి గానీ, ప్రతి విషయాన్ని సీరియస్ గా తీసుకుని, లెక్చర్లు ఇస్తే… తనకే వాల్యూ ఉండదన్న విషయాన్ని కత్తి మహేష్ గుర్తించాలి. ‘జబర్దస్త్’లో తనపై ఓ రెండు, మూడు సెటైర్లు పడ్డాయన్నదే కత్తి ఆవేదన. అయితే చెప్పేటపుడు… ఇది నా కోసం కాదు అనడం కత్తికి మామూలే కదా!
A few Indians dancing inside Costco, Walmart or shopping malls cannot represent the entire Indian…
Nani’s The Paradise has the ingredients for a big theatrical film. The Nani-Srikanth Odela combination…