Telugu

అయితే కవిత ఎవరిని తొక్కుకుంటూ సాగుతారో?

ఏపీ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల చేసిన తప్పుని బీఆర్ఎస్‌ పార్టీ నుంచి బయటకు వచ్చిన కల్వకుంట్ల కవిత చేయకుండా జాగ్రత్త పడుతున్నట్లున్నారు.

మొదట్లో షర్మిల ప్రతీరోజూ తన అన్నపై తీవ్ర విమర్శలు, ఆరోపణలు చేస్తూ అందరి దృష్టిని ఆకర్షించగలిగారు. కానీ ఆమె రోజూ అదే కొనసాగిస్తుండటంతో ఇక ఎవరూ ఆమెని పట్టించుకోవడం మానేశారు.

ADVERTISEMENT

కానీ కవిత అప్పుడప్పుడు మీడియా ముందుకు వచ్చి కొన్ని నిర్దిష్టమైన అంశాలపై మాట్లాడుతూ, పనిలో పనిగా హరీష్ రావు, సంతోష్ రావులపై విమర్శలు గుప్పిస్తున్నారు. కనుక ఆమె ప్రెస్‌మీట్‌ పెడితే అందరూ ఆసక్తిగా గమనిస్తున్నారు.

ఈరోజు ఆమె ప్రెస్‌మీట్‌ పెట్టి ముందుగా ఆల్మట్టి డ్యామ్‌ ఎత్తు పెంచడం వలన తెలంగాణకు కలిగే నష్టం, దీనిపై సిఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం మౌనం వహిస్తున్నారంటూ విమర్శలు చేశారు. తర్వాత బీసీ రిజర్వేషన్స్‌ గురించి కొంతసేపు మాట్లాడి ముగింపులో బీఆర్ఎస్‌ పార్టీ మీద మళ్ళీ బాంబులు వేశారు.

కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో తప్పులు జరుగుతున్నాయని తాను అప్పుడే అన్నని హెచ్చరించానని కానీ పట్టించుకోలేదన్నారు. ఆ విషయంలోనే తాను హరీష్ రావుని వ్యతిరేకిస్తున్నానని స్పష్టం చేశారు.

నేటికీ హరీష్ రావు, సంతోష్ రావుల అనుచరులు సోషల్ మీడియాలో తనపై దాడులు చేస్తూనే ఉన్నారన్నారు. రాజకీయాలలో ఎవరూ స్పేస్ ఇవ్వరని అడ్డొచ్చినవారిని తొక్కుకుంటూ పోవలసిందేనన్నారు.

తనతో టచ్‌లో ఉన్న బీఆర్ఎస్‌ నేతల జాబితా చాలా పెద్దదే ఉందని అది సమయం సందర్భం వచ్చినప్పుడు బయటపెదతానన్నారు. తాను కాంగ్రెస్‌ పార్టీలో చేరడం లేదు… కొత్త పార్టీ పెట్టడం లేదని కవిత స్పష్టం చేశారు.

ఆల్మట్టి డ్యామ్‌ ఎత్తు పెంపు, బీసీ రిజర్వేషన్స్‌ వంటి సమస్యలను పరిష్కరించగలిగితే స్థితి, స్థాయి రెండూ ఆమెకు లేవు. కానీ వాటిని ఆమె తన రాజకీయ ఉనికిని, మనుగడని కాపాడుకునేందుకే ఉపయోగించుకోగలరు. కనుక ప్రతీ ప్రెస్‌మీట్‌లో వాటి గురించి మాట్లాడుతూనే ఉంటారు.

బీఆర్ఎస్‌ నేతలు టచ్‌లో ఉన్నారని చెప్పడం రాజకీయమే. తద్వారా రాష్ట్ర రాజకీయాలలో తానేమీ ఏకాకిగా లేనని, ఒకవేళ బీఆర్ఎస్‌ పార్టీ తన జోలికి వస్తే దానిని నిలువునా చీల్చగలశక్తి తనకుందని హెచ్చరించినట్లే భావించవచ్చు.

రాజకీయాలలో ఎవరూ స్పేస్ ఇవ్వరని అడ్డొచ్చినవారిని తొక్కుకుంటూ పోవలసిందేనన్నారు. అంటే ఆమె కూడా అదే పద్దతిలో ముందుకు సాగాబోతున్నారని అర్ధమవుతోంది. కనుక తెలంగాణ రాజకీయాలలో ముఖ్యంగా తెలంగాణ జాగృతి, బీఆర్ఎస్‌ పార్టీలలో ఎవరు ఎవరిని తొక్కుకుపోతారో రాబోయే రోజుల్లో చూడవచ్చు.

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

Is Ethan Hunt Bigger Than Tom Cruise?

Tom Cruise can still make audiences run to theatres, but it seems they need a…

3 minutes ago

వైసీపీ బీసీ గర్జన… వై ఉత్తరాంధ్ర.?

స్థానిక సంస్థల ఎన్నికల కోసం టీడీపీ ప్రభుత్వం బీసీలకు 34% రిజర్వేషన్ అంశాన్ని తెరమీదకు తెచ్చింది. స్థానిక సంస్థల ఎన్నికల…

16 minutes ago