
కొత్త జిల్లాల ఏర్పాటు తరువాత మార్కెట్‌ను దృష్టిలో పెట్టుకుని ఎకరా గరిష్ఠ ధర రూ.7 లక్షలుగా సర్కారు ఖరారు చేసింది. అయినప్పటికీ చాలా చోట్ల భూములు ఇచ్చేందుకు ఎవరూ ముందుకు రావడం లేదు. ఖర్చుతో కూడుకున్న వ్యవహారం కావడంతో గవర్నమెంట్ కూడా ఈ పథకంపై పెద్దగా దృష్టి పెట్టడంలేదు.
మూడున్నరేళ్లుగా ఈ పథకం కింద లబ్ధిదారుల సంఖ్య 9 జిల్లాల్లో వంద కూడా దాటలేదు. వరంగల్ అర్బన్, హైదరాబాద్, భద్రాద్రి, మేడ్చల్ జిల్లాలలో భూములు లేనందున ఆ జిల్లాలను మొత్తానికి ఈ పధకం నుండే మినహాయించేసారు. మిగతా 27 జిల్లాల్లోనూ తొమ్మిది జిల్లాల్లో పరిస్థితి దారుణంగా ఉంది. రంగారెడ్డి జిల్లాలో అత్యల్పంగా 13 మందికి మాత్రమే భూములు పంచారు. ఎన్నికలు దగ్గర పడుతుండటంతో ఇప్పటికైనా గవర్నమెంట్ ఈ పధకం మీద దృష్టి పెడ్తుందని లబ్ధిదారులు ఆశగా ఎదురుచూస్తున్నారు.
A few Indians dancing inside Costco, Walmart or shopping malls cannot represent the entire Indian…
Nani’s The Paradise has the ingredients for a big theatrical film. The Nani-Srikanth Odela combination…