
ఆంధ్రా, తెలంగాణలు విడిపోయినప్పటికీ రెండు రాష్ట్రాల మద్య రాజకీయాలు మాత్రం బలంగానే ఉన్నాయి. కనుక తెలంగాణ ఎన్నికలలో ఎవరు గెలిస్తేనేమిటి?ఎవరు ఓడితేనేమిటి?అని తేలికగా కొట్టి పడేయలేము. కనుక ఈ ఎన్నికలలో కేసీఆర్ మళ్ళీ ముఖ్యమంత్రి అయితే?ఒకవేళ కాంగ్రెస్ గెలిచి అధికారంలోకి వస్తే?ఆంధ్రా రాజకీయాలపై ఆ ప్రభావం ఏవిదంగా ఉంటుంది?అని ఆలోచిస్తే చాలా తీవ్రంగానే ఉంటుందని చెప్పవచ్చు.
కేసీఆర్ మళ్ళీ ముఖ్యమంత్రి అయితే…
1. ఆయనలో మరింత ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. కనుక ఏపీ శాసనసభ, లోక్‌సభ ఎన్నికలలో బిఆర్ఎస్ పార్టీ కూడా పోటీ చేయవచ్చు.
2. కేసీఆర్, జగన్ ఇద్దరికీ చంద్రబాబు నాయుడే ఉమ్మడి శత్రువు. కనుక మరోసారి టిడిపిని ఓడించేందుకు ఇద్దరూ చేతులు కలపడం ఖాయమే.
3. తెలంగాణకు పరిశ్రమలు, ఐటి కంపెనీలు తరలిరావడానికి పరోక్షంగా తోడ్పడుతున్న జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యేందుకు కేసీఆర్ అన్ని విదాల తోడ్పడతారు.
4. తెలంగాణ మరింత అభివృద్ధి చెందుతుంది. ఆంధ్రప్రదేశ్ పరిస్థితి మరింత దయనీయంగా మారే అవకాశం ఉంటుంది.
తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే…
1. ఏపీ కాంగ్రెస్‌ను మళ్ళీ యాక్టివ్ చేసి వైసీపిలో ముఖ్య నేతలను పార్టీలోకి ఆకర్షించేందుకు గట్టి ప్రయత్నాలు చేయవచ్చు.
2. కాంగ్రెస్‌ను నమ్మి తెలంగాణలో రాజకీయంగా నష్టపోయిన వైఎస్ షర్మిలని ఏపీ కాంగ్రెస్ బాధ్యతలు చేపట్టేలా ఒప్పించి పంపించవచ్చు.
3. ఏపీ శాసనసభ ఎన్నికలకు ముందు కాంగ్రెస్‌ని యాక్టివ్ చేయడం చాలా కష్టమనుకొంటే టిడిపి అధికారంలోకి వచ్చేందుకు సహకరించవచ్చు.
4. అప్పుడు టిడిపి, జనసేనలతో కాంగ్రెస్ కలవకుండా అడ్డుకొనేందుకు బీజేపీ వాటితో పొత్తుకి సిద్దపడవచ్చు. లేదా వైసీపిని గెలిపించేందుకు అన్ని విదాల తోడ్పడవచ్చు.
5. తెలంగాణలో కాంగ్రెస్, ఏపీలో టిడిపి, జనసేనల ప్రభుత్వాలు ఏర్పడిన్నట్లయితే విభజన సమస్యల పరిష్కారమయ్యే అవకాశం ఉంటుంది.
6. ఏపీలో టిడిపి, జనసేనలు అధికారంలోకి వస్తే మళ్ళీ అమరావతి రాజధాని అవుతుంది. భవిష్యత్‌లో రాజధాని మార్పుకి అవకాశం లేకుండా చేసేందుకు సంకీర్ణ ప్రభుత్వం దాని నిర్మాణ పనులను శరవేగంగా పూర్తి చేసేందుకు ప్రయత్నిస్తుంది.
7. ఆంధ్రప్రదేశ్ మళ్ళీ గాడిన పడుతుంది. పరిశ్రమలు, ఐటి కంపెనీలు తరలివస్తాయి.
BOTTOM LINE Slow, Sincere Manhunt Drama PLATFORM ZEE5 RUNTIME 2Hrs 30Mins What Is the Show…
The Department of Homeland Security (DHS) has proposed a new rule. This rule is set…