‘యాగాలు’ కేసులనుండి కాపాడాయతా.?

 

సెంటిమెంట్ లు ఒక్కోసారి రాజకీయాలను శాసిస్తాయి, ఆయా పార్టీల అధినేతలను ఆలోచింపచేస్తాయి. అధికారం నుంచి వివాదం వరకు అన్నింటికి రాజకీయ నాయకులకు ఒక్కొక్కరికి ఒక్కో సెంటిమెంట్ అస్త్రం ఉంటుంది.

ADVERTISEMENT

ఈ విషయంలో రాజకీయ తెరమీద ప్రముఖంగా వినిపించే పేరు, బిఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్ర శేఖర్ రావు. ఈయన అధికారం పొందడానికి, ఆ అధికారం చేజారకుండా ఉండడానికి, హ్యాట్రిక్ విజయం అందుకోవడానికి ఇలా పార్టీని ప్రభుత్వంలో ఉంచడానికి, తాను పదవిలో ఉండడానికి ప్రజలకంటే ఎక్కువగా యజ్ఞ యాగాదులనే నమ్ముకున్నారు.

అయితే ఆ యాగాలు, యజ్ఞాలు కేసీఆర్ కు అన్నివేళలా అధికారాన్ని కట్ఠబెట్టలేకపోయాయి. 2023 ఎన్నికల ముందు కూడా కేసీఆర్ తన ఫామ్ హౌస్ లో తన పార్టీ హ్యాట్రిక్ విజయం కోసం ఛండీయాగం నిర్వహించారు. అయినా ప్రతిపక్షానికే పరిమితం కావాల్సి వచ్చింది.

ఆ తరువాత పదేళ్ల తరువాత తెలంగాణ ప్రతిపక్ష నేతగా తన కార్యాచరణ ప్రారంభించేందుకు కూడా కేసీఆర్ యజ్ఞాలనే నమ్ముకున్నారు, కానీ ఫామ్ హౌస్ గడప దాటి ప్రజా క్షేత్రంలోకి రాలేకపోయారు.

ఇక ఇప్పుడు గత పదేళ్ల బిఆర్ఎస్ ప్రభుత్వ అవినీతి అంటూ రేవంత్ సర్కార్ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పై కాళేశ్వరం అక్రమాలు అంటూ కమిషన్ వేసింది. అయితే ఆ కమిషన్ కూడా పూర్తి స్థాయిలో విచారణ జరిపి తుది నివేదికను ప్రభుత్వానికి అందించింది.

అయితే ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా నేడు ముఖ్యమంత్రి రేవంత్ అధ్యక్షతన జరగనున్న క్యాబినెట్ మీటింగ్ లో పీసీ ఘోష్ నివేదిక పై చర్చించనుంది. అయితే నివేదిక కేసీఆర్ కు వ్యతిరేకంగా, బిఆర్ఎస్ కు ప్రతికూలంగా ఉన్న నేపథ్యంలో కేసీఆర్ ఇప్పుడు ప్రభుత్వాన్ని ఎలా ఎదుర్కోనున్నారు.? నివేదిక పై తన స్పందన ఎలా వెల్లడించనున్నారు అన్న చర్చ జరుగుతుంది.

ఇదే సమయంలో కేసీఆర్ తన ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో నేటి నుంచి మూడు రోజుల పాటు ఛండీయాగం నిర్వహించనున్నట్టు ప్రకటించారు. పార్టీని వెండాడుతున్న ప్రతికూల ఫలితాలు, పార్టీ నాయకులకు ఎదురవుతున్నకేసుల చిట్టాలు, బిఆర్ఎస్ లో మొదలైన కవిత ఇంటి పోరు రచ్చకు తన యాగాలతో కేసీఆర్ ముగింపు పలకదలిచారు.

దీనితో యజ్ఞాలు, యాగాలు అవినీతిని కప్పి ఉంచగలవా.? కేసుల నుంచి తప్పించగలవా.? విచారణను దాటవేయగలవా.? ఇంటి పోరు ని చల్లార్చగలవా.? అంటూ కేసీఆర్ పై విమర్శలు మొదలయ్యాయి.

రాజకీయాలలో ప్రజలకు అందుబాటులో ఉండాల్సిన నాయకులు, క్యాడర్ కు అండగా నిలవాల్సిన నేతలు ఫామ్ హౌస్ లకు పరిమితం అవుతూ చివరికి ఇలా పుణ్యకార్యాలతో కాలం కలిసి రావాలని ఆశించడం హాస్యాస్పదం అవుతుంది. నాడు హ్యాట్రిక్ విజయాన్ని అందించలేని యాగాలు నేడు కేసీఆర్ ను విచారణ నుంచి కాపాడగలవా.?

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Recent Posts

Jogi’s DIL Reaches Governor: Threat To Her Life?

The highly controversial case pertaining to Jogi Rajeev, the son of former cabinet minister Jogi…

10 minutes ago

ఈసారి విజయవాడ మేయర్ పదవి ఎవరికి?

రాజకీయ పార్టీలకు ఎన్నికలు, అధికారం, పదవులు చాలా ముఖ్యమే. కానీ ప్రతీసారి వాటితోనే చాలా తలనొప్పులు ఊహించని సమస్యలు భరించాల్సివస్తుంటుంది.…

60 minutes ago