
ముఖ్యంగా ‘కళ్యాణ లక్ష్మి’ పేరుతో ఇవ్వాల్సిన నిధులను ప్రభుత్వం మంజూరు చేయడం లేదంటూ లబ్ధిదారులు గగ్గోలు పెడుతూ మీడియాలకెక్కుతున్నారు. ఇప్పటివరకు లక్షా పదకొండు వేలకు పైగా అప్లికేషన్స్ పెండింగ్ లో ఉన్నట్లుగా లెక్కలు చెప్తున్నాయి. అధికారులేమో టీఆర్ఎస్ నేతల వద్దకు వెళ్లి గోడును వెలిబుచ్చుకోమని చెప్తున్నట్లుగా దరఖాస్తు దారులు వాపోతున్నారు.
కేసీఆర్ ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన కార్యక్రమాలలో “కళ్యాణ లక్ష్మి” ఒకటి. ఇపుడు అది మరుగున పడే స్థితికి రావడం వెనుక ప్రభుత్వ వైఫల్యత ఓ కారణం కాగా, మితిమీరిన సంక్షేమ పధకాలు ఆదాయం పుష్కలంగా ఉన్న తెలంగాణ వంటి రాష్ట్రాలను కూడా ఇబ్బందులకు గురి చేస్తాయని రాజకీయ విశ్లేషకులు చేస్తోన్న పరిశీలన.
ఏ పధకం అయినా ప్రజల్లోకి తీసుకువెళ్లే ముందే అన్ని సమాలోచనలు చేయాల్సి ఉంది. కానీ ప్రస్తుత ప్రభుత్వాలు ఓటు బ్యాంకింగ్ రాజకీయాలలో భాగంగా నిర్దిష్టమైన ప్రణాళికలు లేకుండా పధకాలను రూపొందించడమే ఈ లోటుకు ప్రధాన కారణంగా పొలిటికల్ వర్గాలు చెప్పుకుంటున్నాయి.
ఒక్కసారి ప్రజల్లోకి వెళ్ళాక, అది అమలుకు నోచుకోకపోతే ఏ ప్రభుత్వం పైన అయినా సరే తిరుగుబాటు జెండా ఎగరడం ఖాయమని చరిత్ర చెప్పకనే చెప్తోంది.
Namit Malhotra’s ambitious project Ramayana, starring Ranbir Kapoor, will arrive in cinemas on November 5.…
Malavika Mohanan brings a striking dose of royal glamour to this pink and gold saree…