
బిఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెన్షన్ తో బయటకొచ్చిన కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవిత జాగృతి రాజకీయం నానాటికి రాటు తేలుతుంది. బిఆర్ఎస్ ముఖ్యనేతలే టార్గెట్గా ఆమె చేస్తున్న రాజకీయ విమర్శలు ఒక పక్క, కేసీఆర్ ఫోటో లేకుండానే నా ఈ ఒంటరి ప్రయాణం అంటూ ఆమె చేస్తున్న ప్రకటనలు మరోపక్క ఆమెలో ఉన్న కాన్ఫిడెన్స్ కు అద్దం పడుతున్నాయి.
అయితే తాజాగా కవిత ఇచ్చిన ఒక ఇంటర్ వ్యూ లో ఆమె చేసిన కొన్ని వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇప్పుడు ఆ అంశాల గురించి ఒక్కసారి మాట్లాడుకుంటే, కేసీఆర్ విజ్ఞప్తి మేరకు భవిష్యత్ లో కవిత తిరిగి బిఆర్ఎస్ లో చేరుతుందా అంటూ సదరు యాంకర్ కవితను ప్రశ్నించగా,
అందుకు కవిత ఒకవేళ స్వయంగా కేసీఆరే తనను పార్టీలోకి తిరిగి ఆహ్వానించినా తానూ తిరిగి బిఆర్ఎస్ లోకి వెళ్లే ప్రసక్తే లేదని, లేదంటే వారు మరి పట్టుబడితే కేసీఆర్ నే జాగృతి పార్టీలోకి ఆహ్వానిస్తానంటూ సమాధానమిచ్చారు. అయితే సదరు జర్నలిస్ట్ అడిగినట్టుగా అసలు కేసీఆర్, కవితను తిరిగి బిఆర్ఎస్ లోకి ఆహ్వానించే అవకాశం ఉంటుందా.?
అలాగే కవిత చెపుతున్నట్టుగా కేసీఆర్ తానూ స్థాపించిన బిఆర్ఎస్ ను వదిలిపెట్టి కూతురు ఏర్పాటు చేసుకున్న జాగృతి లో అడుగుపెట్టే ఆలోచన చేస్తారా.? అయితే ఈ రెండు విషయాలను రాజకీయ కోణంలో పరిశీలిస్తే ఒకటి కవిత అత్యాశ అయితే మరొకటి ఆమె ఓవర్ కాన్ఫిడెన్స్ అవుతుంది.
గత బిఆర్ఎస్ ప్రభుత్వం పైన, ఆ పార్టీ ముఖ్య నేతలు హరీష్, సంతోష్ లపై కవిత చేసిన అవినీతి ఆరోపణలు, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై చేస్తున్న విమర్శలు నేపథ్యంలో కేసీఆర్ ప్రస్తుత రాజకీయ పరిస్థితులలో కవిత పట్ల సానుకూలంగా స్పందిస్తారా.? ఒకవేళ కుమార్తె అనే బంధం కేసీఆర్ కళ్ళు కప్పేసినా అందుకు హరీష్, కేటీఆర్ అంగీకరిస్తారా.?
అలాగే కవిత చెపుతున్నట్టుగా కేసీఆర్ బిఆర్ఎస్ ను వదులుకుని తన రాజకీయ వారసుడైన కేటీఆర్ ని కాదనుకుని కుమార్తె కవిత స్థాపించిన జాగృతి పంచన చేరుతారా.? ఇవన్నీ ఆచరణ సాధయమయ్యే పనులైనా.? రాజకీయాలలో ఎప్పుడు ఏమైనా జరగవచ్చు అన్న ఒక్క ఆలోచనే కవితను ఇటువైపు ఆలోచించేలా చేస్తుందా అన్న చర్చ జరుగుతుంది.
Venkatesh Maha is returning with his next film Attahaasam. The film is set in the…
Earlier there were multiple unverified media reports about the ACB court potentially looking at impounding…