
కరోనా ని ఎదురుకోవడానికి ఎంత ఎక్కువ టెస్టులు చేస్తే అంత మంచిది అని అంతా అంటున్నా ఆ దిశగా తెలంగాణ చేస్తున్నది ఏమీ లేదు. పొరుగున ఉన్న ఆంధ్రప్రదేశ్ ఇప్పటివరకు 6,12,397 టెస్టులు చేస్తే… తెలంగాణ నిన్నటి వరకూ చేసింది కేవలం 45,911. రెండు రోజుల క్రిందట ఆర్భాటంతో పది రోజులలో 50,000 టెస్టులు చెయ్యాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.
ఆ తరువాత సోమవారం నాడు 1,200 పై చిలుకు టెస్టులు చెయ్యగా.. మంగళవారం నాడు 1,000 పై చిలుకు టెస్టులు చేసింది. రెండో రోజు పెరగాల్సి ఉండగా టెస్టులు తగ్గాయి… ఈ లెక్కన పది రోజుల్లో యాభై వేల టెస్టులు కూడా జరిగేది కనపడటం లేదు. చెప్పేదానికి చేసేదానికి ఇంత తేడానా? అనేలా ఉంది ఈ విషయంలో తెలంగాణ ప్రభుత్వం వైఖరి.
నిన్న జరిపిన 1,096 టెస్టులలో 269 కేసులు పాజిటివ్ గా తేలాయి. అంటే దాదాపుగా 24.5% కేసులు పాజిటివ్ గా తేలాయి. ఈ లెక్కన ఆంధ్రప్రదేశ్ మాదిరి రోజుకు పది పదిహేను వేల టెస్టులు చేస్తే రోజుకు ఎన్ని కేసులు బయటపడేవో అని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. తెలంగాణ మరో మహారాష్ట్రలా మారేదేమో!
Royal Challengers Bengaluru defeated Mumbai Indians by 2 wickets in a thrilling last-ball match in…
After facing a series of disappointments at the box office, actor Ram Pothineni now appears…