Telugu

కేసీఆర్‌ రావద్దని చెప్పేశారు… థాంక్ గాడ్!

“అందరికీ చేతులెత్తి దణ్ణం పెడతా…నన్ను పరామర్శించేందుకు ఎవరు రావద్దు బాబోయ్” అంటూ కేసీఆర్‌ ఓ వీడియో సందేశం విడుదల చేశారు. తెలంగాణలో తనకు తిరుగేలేదనుకొంటే శాసనసభ ఎన్నికలలో ఘోర పరాజయం… అదీ రేవంత్‌ రెడ్డి చేతిలో!

శాస్వితమనుకొన్న ముఖ్యమంత్రి పదవి కోల్పోవడం… ఈ మానోవేదనకు తోడు బాత్రూములో కాలు జారిపడిపోవడంతో తుంటి ఎముక మార్పిడి శస్త్ర చికిత్స చేయించుకొని యశోదా ఆస్పత్రిలో మంచానికే పరిమితం కావలసి వచ్చింది.

ADVERTISEMENT

ఇన్ని బాధలు అనుభవిస్తుంటే ఆయనను ఓడించి ఇంటికి పంపించిన రేవంత్‌ రెడ్డి, కాంగ్రెస్‌ మంత్రులు, ఆ తర్వాత తాను గద్దె దించిన చంద్రబాబు నాయుడు వచ్చి పరామర్శించడం తుంటి ఎముక నొప్పి కంటే ఎక్కువ బాధాకరమే.

కేసీఆర్‌ మీద అభిమానం వల్లనో మళ్ళీ ఎప్పుడు ఆయనతో ఏ అవసరం పడుతుందో అనే ముందు చూపుతోనో ఇంకా చాలా మంది ఆయనను పరాంర్శించేందుకు యశోదా ఆస్పత్రికి క్యూ కడుతున్నారు. ఇవాళ్ళ మజ్లీస్ ఎమ్మెల్యేలు, మెగాస్టార్ చిరంజీవి, కొందరు బిఆర్ఎస్‌ నేతలు వచ్చి పరామర్శించి వెళ్లారు.

ఎన్నికలలో గెలిచి, ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చొన్నప్పుడు ఇటువంటివి చాలా సంతోషం కలిగించవచ్చు కానీ ఈ పరిస్థితులలో మాత్రం పుండు మీద కారం చల్లిన్నట్లే ఉంటాయని చెప్పక తప్పదు. బహుశః అందుకే ప్రజలు, అభిమానులకు విజ్ఞప్తి అంటూ కేసీఆర్‌ అందరికీ దణ్ణం పెట్టేసి పరామర్శలకు రావద్దని చెప్పేశారు.

నేడో రేపో ఏపీ సిఎం జగన్మోహన్‌ రెడ్డి, ఆయన మంత్రులు కూడా భవిష్యత్‌ అవసరాల కోసం పరామర్శకు బయలుదేరవచ్చను కొంటే, కేసీఆరే రావద్దని చెప్పేశారు. కనుక ఇక వారిని ఎవరూ తప్పుపట్టలేరు. థాంక్ గాడ్!

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

Vrushakarma: Chay’s Mysterious Journey Unveiled

The latest poster of Vrushakarma features Naga Chaitanya holding a distinctive weapon against a mysterious…

28 minutes ago

Traitors Telugu: Teja Sajja Makes His Hosting Debut

The popular reality show The Traitors is making its Telugu debut with Prime Video’s The…

38 minutes ago