Telugu

ఎన్నికల వేళ రైతులకు కేసీఆర్ మరో బృహత్తర పథకం!

రైతులే టార్గెట్ గా తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర రావు ఎన్నికలకు సిద్ధం అవుతున్నట్టు కనిపిస్తుంది. ఇప్పటికే రైతు బంధు, రైతులకు ఉచిత ఇన్సూరెన్స్ వంటి పధకాలు ప్రవేశ పెట్టిన తెలంగాణ ప్రభుత్వం తాజాగా ఇంకో పధకానికి నాంది పలకనుంది. ఈ ఖరీఫ్‌ సీజన్‌ నుంచే రైతులకు ఉచితంగా యూరియా సరఫరా చేయాలని సీఎం కేసీఆర్‌ భావిస్తున్నట్లు సమాచారం.

ADVERTISEMENT

వానాకాలం, యాసంగిలో ఏ పంట సాగు చేసినా యూరియా వినియోగం తప్పనిసరి. ఇటీవలే కేంద్రం యూరియా రేటు పెంచింది కూడా. దీనితో రైతులకు ఉచితంగా యూరియా ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం సంకల్పించింది. ఈ పధకానికి 500 కోట్లు ఖర్చు అవ్వనుందని అంచనా. ప్రభుత్వం నేరుగా కర్మాగారాల నుంచి కొనుగోలు చేస్తే, ధర కొంత తగ్గే అవకాశం ఉందని అధికార వర్గాలు చెబుతున్నాయి.

ఖరీఫ్‌ సీజన్‌కు ప్రభుత్వం 500 కోట్లు భరించడానికి సిద్ధపడితే, రైతులకు ఉచితంగా యూరియా అందించవచ్చని ఉన్నతాధికారులు చెబుతున్నారు. యూరియా ఉచిత పంపిణీ సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని ఆయన ఉన్నతాధికారులను ఆదేశించినట్లు తెలిసింది. ఎన్నికల వేళ రైతు కుటుంబాల ఓట్లు గంపగుత్తుగా ఈ పధకాలు తెచ్చి పెడతాయని కేసీఆర్ అంచనా.

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

‘Pocket Rockets’ Is Niharika’s Next!

Niharika Konidela’s production banner, Pink Elephant Pictures, has joined Maximum City Studios for Pocket Rockets,…

16 minutes ago

Summer Holidays Trailer: A Family Story Set for Nov 6

After films like The Girlfriend, Chennai Love Story, and Couple Friendly, producer Dheeraj Mogilineni brings…

31 minutes ago