అసెంబ్లీ రద్దు తర్వాత ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ప్రతిపక్ష పార్టీలతో పాటు మీడియా వర్గీయులను కూడా ఏ మాత్రం ఉపేక్షించకుండా సమాధానాలు ఇచ్చారు తెలంగాణా ఆపద్ధర్మ ముఖ్యమంత్రి. తాను చెప్పదలుచుకున్నది చెప్పిన అనంతరం, ఒకరి తర్వాత ఒకరు మీడియా ప్రతినిధులు ప్రశ్నలు వేయండి అంటూ మొదలుపెట్టిన కేసీఆర్, కేవలం తనకు అనువైన ప్రశ్నలకు మాత్రమే బదులిచ్చారు.
[m9ad]
చాలామంది మీడియా ప్రతినిధులు వేసిన ప్రశ్నలకు… ‘అదొక ప్రశ్న? దానిని మీరు నన్ను అడగడం’ అంటూ… ‘ఈ ప్రశ్నకు నేను జవాబు చెప్పేదేంటి’ అని… ‘మీకు ఈ మాత్రం కూడా తెలియదా?’ అంటూ వివిధ రకాలుగా మీడియా వర్గీయులకు కూడా చుక్కలు చూపించారు. ఇక నరేంద్ర మోడీపై ప్రశ్న వచ్చిన సమయంలో మాత్రం… కాస్తంత తెలివిగా మోడీ వర్గాలకు కోపం కలిగించకుండా మాట్లాడారు.
మోడీ వ్యతిరేకం ఉందో లేదో ఎన్నికలకు వెళితే గానీ తెలియదు కదా.., అయిన మోడీకి అనుకూలం కూడా ఉండొచ్చు కదా, అది మనమెలా చెప్తాం అన్న కేసీఆర్, తెలంగాణాలో బిజెపి స్థితి గురించి మీరు నన్ను అడగడం ఏంటి? అది అందరికీ తెలిసిందే అన్నారు. రేపొద్దుగల్లా నాకు పిఎం అయిపోదామని ఉంటది, అయిపోతానా? తెలంగాణాలో బిజెపి కూడా అంతే! అంటూ తనదైన శైలిలో చమత్కరించారు కేసీఆర్.



