
తర్వాత కూడా చట్టాన్ని అతిక్రమిస్తుంటే అనుమతులను రద్దు చేస్తుంది. రాష్ట్ర పాఠ్య ప్రణాళికతోపాటు సీబీఎస్‌ఈ, ఐసీఎస్‌ఈ, ఐబీ తదితర బోర్డుల ప్రైవేట్ పాఠశాలలు తెలుగు అమలు చేయకుండా మొదటిసారి పట్టుబడితే రూ.50 వేలు జరిమానా, రెండోసారి అయితే రూ.లక్ష జరిమానా విధిస్తారు. మొదటిసారి నిబంధనలు అతిక్రమించారని గుర్తిస్తే అధికారులు యాజమాన్యానికి నోటీసులు జారీ చేస్తారు.
ఒకవేళ ఉల్లంఘన చేస్తున్నారని నిర్ధరణకు వస్తే లోపాలను సవరించుకోవడానికి నెల గడువు ఇస్తారు. ఆలోపు అమలు చేయని పక్షంలో మొదటి ఉల్లంఘనగా రూ.50 వేలు జరిమానా విధిస్తారు. రెండోసారి ఉల్లంఘిస్తే రూ.లక్ష జరిమానా విధిస్తారు. తర్వాత కూడా నిబంధనల ఉల్లంఘన కొనసాగితే ఆ పాఠశాల గుర్తింపును రద్దు చేస్తారు. ఏదో నామ్ కే వాస్తే గా కాకుండా చిత్తశుద్ధితో తెలుగును ప్రోత్సహిస్తున్న కేసీఆర్ ప్రభుత్వానికి జోహార్లు.
భారత్‌లోనే ఒక రాష్ట్రం వాళ్ళు మరో రాష్ట్రంలో ఉద్యోగం, వ్యాపారాల రీత్యా స్థిరపడితే పరాయి దేశస్థుడన్నట్లు చూస్తుంటారు. తమ ఉద్యోగాలు,…
కాళేశ్వరం కేసులో కేసీఆర్, హరీష్ రావు తప్పకుండా జైలుకి వెళ్తారని సిఎం రేవంత్ రెడ్డి చెప్పి ఇంకా 48 గంటలు…