
నేడు ఎర్రవల్లి ఫామ్‌హౌసులో బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ పార్టీ ముఖ్య నేతలతో సమావేశమయ్యారు. దానిలో పార్టీ కమిటీల ఏర్పాటు, సభ్యత్వ నమోదు, భవిష్య కార్యాచరణ, అనుసరించాల్సిన వ్యూహాల గురించి చర్చించినట్లు తెలుస్తోంది.
ఏ పార్టీలోనైనా ఇవన్నీ రొటీన్‌గా జరిగే పనులే. ఇవి పార్టీ నిర్మాణం, నిర్వహణలో భాగం మాత్రమే. కనుక వీటితో బీఆర్ఎస్ పార్టీ భవిష్యత్ కానీ రాష్ట్ర రాజకీయాలలో గానీ ఎటువంటి మార్పు రాబోదు.
తెలంగాణలో ఎన్నటికీ మరో పార్టీ ఎన్నికలలో గెలవలేదని, అధికారంలో రాలేదని గట్టిగా నమ్మి అందరినీ నమ్మించినప్పుడు ఎందుకు ఓడిపోయాము? ఎవరు బాధ్యులు? తప్పులు సరిదిద్దుకున్నామా లేదా? అని నేటికీ బీఆర్ఎస్ పార్టీ అధిష్టానం ఆత్మవిమర్శ చేసుకోలేదు. ఎందుకంటే కాంగ్రెస్ భూటకపు హామీలను ప్రజలు నమ్మడం వల్లనే ఓడిపోయామని ఆత్మవంచన చేసుకుంటున్నారు కనుక.
శాసనసభ్యుడుగా ఏటా లక్షల రూపాయలు జీతభత్యాలు, భద్రత, ఎస్కార్ట్ కాన్వాయ్ సదుపాయాలు పొందుతున్న కేసీఆర్ శాసనసభ సమావేశాలకు హాజరుకావడం లేదు. ఎంత మంది ఎన్ని విమర్శలు చేస్తున్నప్పటికీ కేసీఆర్ ఫామ్‌హౌసు వదిలి బయటకు రావడం లేదు.
కూతురు కల్వకుంట్ల కవిత పార్టీ ఏర్పాటు చేసి కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావులను పేరు పెట్టి మరీ విమర్శిస్తున్నా జవాబు చెప్పకుండా మౌనం వహిస్తున్నారు.
రెండు రోజుల క్రితమే ప్రధాని మోడీ హైదరాబాద్ వచ్చి “పశ్చిమ బెంగాల్ తర్వాత తెలంగాణయే మా టార్గెట్ అందరూ రెడీగా ఉండండని…” చెప్పి మరీ వెళ్ళారు.
వచ్చే ఎన్నికలలో టీడీపి, జనసేన, బిజేపి కలిసి పోటీ చేసే అవకాశం ఉందని కూడా ప్రధాని మోడీ హింట్ ఇచ్చి వెళ్ళారు.
మరో పక్క కూతురు కవిత “నెక్స్ట్ సిఎం నేనే..” అంటూ తండ్రితో పోటీకి సై అంటున్నారు.
మరో పదేళ్ళు కాంగ్రెస్ పార్టీయే… నేనే సిఎం అని రేవంత్ రెడ్డి బల్లగుద్ది చెపుతున్నారు.
కనుక కేసీఆర్ ఫామ్‌హౌసులో నుంచి బయటకు రాకుండా ఒంటరిగా ఇంత మందిని, ఇన్ని పార్టీలను ఎదుర్కొని గెలుస్తామని చెప్పడానికి బలమైన కారణాలు చూపగలగాలి. అందుకు తగ్గట్లు కార్యాచరణ సిద్ధం చేసుకొని అమలుచేయాలి. ముఖ్యంగా కేసీఆర్ తన ఆలోచనావిధానం మార్చుకోవాలి.
కానీ అవేమీ చేయకుండా ఇటు కుర్చీలు అటూ, అటు కుర్చీలు ఇటూ ఎన్నిసార్లు మార్చినా ప్రయోజనం ఉండదు.
Venkatesh’s much-hyped Aadarsha Kutumbam AK 47, directed by Trivikram, has been indefinitely postponed. Producer Naga…
The Ministry of External Affairs in India has amended the passport rules for minors of…