Telugu

సినిమాలలో బూతు: ఎవరిది తప్పు?

ఒకప్పుడు అడల్ట్ సినిమాలు వేరేగా వచ్చేవి. అలాగే సినిమాలలో ఐటెం సాంగులకు జ్యోతిలక్ష్మి,జయమాలిని వంటివారు వేరేగా ఉండేవారు. ఆనాటి పాటలలో కూడా డబుల్ మీనింగ్ ఉండేది. కానీ కాస్త సున్నితంగా ఉండేది. ఇప్పుడు సినిమాలలో అలాంటి పట్టింపులు, భేషజాలు ఏమీ లేవు. పచ్చిబూతులే వినిపిస్తున్నాయిప్పుడు.

బూతులే చెపుతున్నప్పుడు మళ్ళీ డబుల్ మీనింగ్ దేనికి అన్నట్లు పాటలు కూడా రాన్రాను కసెక్కిపోతున్నాయి. లిప్ లాక్ సీన్లు సర్వసాధారణం. అలాగని ఫ్యామిలీ ఆడియన్స్ వాటిని చూడటం మానేయలేదు. ఎంజాయ్ చేస్తున్నారు. కనుక రాన్రాను అశ్లీల డోస్ పెరుగుతూనే ఉంది.

ADVERTISEMENT

తాజాగా ‘కేడీ: ది డెవిల్’ సినిమాలో ‘సర్కే చునార్ తేరి సర్కే’ పాటలో డబుల్ మీనింగ్ డోస్‌పై అభ్యంతరాలు, విమర్శలు మొదలయ్యాయి. దాంతో ఆ పాటని వెనక్కు తీసుకొని లిరిక్స్ మార్చి మళ్ళీ పెడతామని దర్శకుడు ప్రేమ్‌ చెప్పగా, ఆ పాట పాడిన గాయని మంగ్లీ క్షమాపణలు చెప్పారు. అంటే పాటలో ఎంత బూతు ఉందో అర్థం చేసుకోవచ్చు.

ప్రేక్షకుల అభిరుచి (బలహీనత)ని బట్టి సినిమాలు తీస్తుంటామని దర్శక నిర్మాతలు తప్పుని ప్రేక్షకులకు బదిలీ చేసి తప్పుకుంటారు.

దర్శకుడు కోరినట్లే (బూతు)పాట వ్రాశామని గీత రచయిత, దానిని తాము కేవలం కంపోజ్ చేసి సంగీతం అందించామని మ్యూజిక్ డైరెక్టర్, డాన్స్ చేయించామని కొరియో గ్రాఫర్, షూట్ చేశామని కెమెరా మ్యాన్, డాన్స్ చేశామని నటీనటులు, తప్పుని మరొకరికి బదిలీ చేసేస్తుంటారు. తమ వల్ల తప్పు జరిగిందని ఒప్పుకోవడానికి అంగీకరించనివారు, సినిమా సూపర్ హిట్ అయితే క్రెడిట్ కోసం పోటీ పడుతుంటారు.

విజయ్‌ చివరి సినిమా ‘జన నాయకుడు’తో దేశానికి పెను ప్రమాదం కలుగుతుందని ఆందోళన చెందుతూ సెన్సార్ సర్టిఫికేట్ ఇవ్వకుండా నిలిపివేస్తుంది. కానీ ఇలాంటి బూతు పాటలని, అశ్లీల నృత్యాలు కేవలం మనసును ఉల్లాసపరిచేందుకే అని భావిస్తూ గ్రీన్ సిగ్నల్‌ ఇచ్చేస్తుంది.

కనుక తిలా పాపం తలా పిడికెడు అని సరిపెట్టుకోవాల్కొసిందే.

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

Ajay Devgn Avoids Akshay Kumar: Sensible or Scared?

Two upcoming releases, Dhamaal 4 and Welcome to the Jungle, have changed their release dates.…

26 minutes ago

Pics: Ishita Raj Mesmerizes In Mint Green Lehenga Look

Ishita Raj is raising the bar for modern festive glamour, effortlessly blending traditional richness with…

47 minutes ago