
హిందూ ఐక్యవేది కార్యకర్తలు ఈ పద్యంపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. హిందువుల మనోభావాలను ఈ పద్యం తీవ్రంగా గాయపరిచిందని పేర్కొన్నారు. దీంతో స్పందించిన కాలేజీ ప్రిన్సిపాల్ ఆజాద్ మాలాట్టిల్ మాట్లాడుతూ తాము ఉద్దేశపూర్వకంగా ఆ పని చేయలేదని పేర్కొన్నారు. మనోభావాలు గాయపడి ఉంటే తమను క్షమించాలని వేడుకున్నారు. ఇదిలా ఉండగా, 125 ఏళ్ల చరిత్ర కలిగిన తలసేరీలోని బ్రెనన్ కాలేజీ పబ్లిష్ చేసిన మ్యాగజైన్ కూడా రెండు రోజుల క్రితం వివాదాస్పదమైంది.
ఓ థియేటర్‌లో జాతీయ గీతం ఆలపిస్తున్న సమయంలో ఓ జంట అసభ్యకర భంగిమలో ఉన్నట్టు ప్రచురించింది. మ్యాగజైన్‌ను ప్రచురించిన కాలేజీపై అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ కేసు పెడుతూ సత్వర చర్యలకు డిమాండ్ చేసింది. కాలేజీ తీరుపై దేశ వ్యాప్తంగా వెల్లువెత్తుతున్న విమర్శలు చల్లారక ముందే తాజా మ్యాగజైన్ కలకలం రేపుతోంది. అయితే ఈ రెండు మ్యాగజైన్ లు కేరళ కాలేజీలవే కావడం గమనార్హం.
Following the failure of Vaa Vaathiyaar, Karthi is now all set to return with his…
Andhra Pradesh chief minister, Chandrababu Naidu has been fully committed and dedicated towards the completion…