
అయితే ఈ వసతులు కొందరు భక్తులకు ఇబ్బందికరంగానే ఉంటాయి. ముఖ్యంగా వృద్ధులకు, మోకాళ్ళ నొప్పులతో ఇబ్బందులు పడేవారు, ఏటవాలుగా ఉండే ఆ కొండను ఎక్కడానికి భయపడుతుంటారు. ఆ చిన్ముద్రుని రూపంలో ఉన్న మణికంఠ స్వామి దర్శనం చేసుకోవాలనుకునే భక్తులకు ఇది కొంత అవరోధంగానే భావించవచ్చు. అయితే కేరళ మంత్రివర్గం తీసుకున్న తాజా నిర్ణయంతో దేశవ్యాప్తంగా ఉన్న అనేకమంది భక్తులకు తీపి వార్త లభించినట్లయ్యింది. పవిత్ర పుణ్యక్షేత్రం శబరిమలలో గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయ ఏర్పాటుకు కేరళ మంత్రి వర్గం తాజాగా ఆమోద ముద్ర వేసింది.
ఇక్కడ విమానాశ్రయం ఏర్పాటైతే భక్తులకు ఎంతో సౌకర్యంగా ఉంటుందని ప్రభుత్వం భావించింది. ఎయిర్ పోర్టు ఏర్పాటుకు సంబంధించి రాష్ట్ర పారిశ్రామిక అభివృద్ధి కార్పొరేషన్ ప్రతిపాదనలు సిద్ధం చేసి ప్రభుత్వానికి సమర్పించింది. బుధవారం నిర్వహించిన రాష్ట్ర కేబినెట్‌లో మంత్రివర్గం దీనికి ఆమోదం తెలిపింది. జీవితంలో ఒక్కసారైనా శబరిమలను దర్శించుకోవాలనుకునే భక్తులకు ఈ నిర్ణయం ఖచ్చితంగా ఊరటనిచ్చే అంశం అని చెప్పడంలో సందేహం లేదు. అయితే ఏ ఏ ప్రాంతాల నుండి ఈ సౌకర్యం ఏర్పాటు చేస్తారనేది కీలకంగా మారింది.
తెలంగాణ బిజేపి అధ్యక్షుడు రాంచందర్ రావు మూడు రోజుల క్రితం మీడియాతో మాట్లాడుతూ ప్రధాని మోడీ హైదరాబాద్ పర్యటనతో రాష్ట్ర…
Prime Minister Modi’s relentless energy is the ultimate case study in discipline. Just days ago,…