
జూ.ఎన్టీఆర్ పుట్టినరోజు పురస్కరించుకొని కేశినేని నాని నిన్న విజయవాడలో కేశినేని భవన్లో వేడుకలు నిర్వహించి, సమాజసేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. “వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు నాకు పార్టీ టికెట్ లభిస్తుందా లేదా అనే దాని గురించి నేను ఆలోచించడం లేదు. ఒకవేళ టికెట్ ఇస్తే పోటీ చేస్తా లేకుంటే ఇక్కడే కూర్చొని సమాజాసేవ కార్యక్రమాలు చేసుకొంటా. నాకు విజయవాడ అభివృద్ధే ముఖ్యం. అందుకోసం నేను గొంగళీ పురుగునైనా ముద్దాడుతా, ఎలుగుబంటిని, ముళ్ళపందినైనా కౌగలించుకొంటా. విజయవాడ అభివృద్ధి కోసమే నేను వైసీపీ ఎమ్మెల్యేలు ఉదయభాను, మొండితోకలతో సమన్వయం చేసుకొంటూ ఎంపీ లాడ్స్ నిధులు ఇచ్చి పనులు చేయిస్తున్నాను తప్ప మా మద్య ఎటువంటి చీకటి ఒప్పందాలు లేవు,” అని కేశినేని నాని అన్నారు.
ఆయన వైసీపీ నేతలతో రాసుకుపూసుకు తిరుగుతూ, విజయవాడ అభివృద్ధి కోసమే అని చెప్పుకొంటున్నప్పటికీ పార్టీ గీతను దాటుతున్నారని అర్దం అవుతోంది. కనుకనే టిడిపి అధిష్టానం కూడా ఆయనని అనుమానించవలసి వస్తోంది. అటువంటప్పుడు ఆయన టిడిపిలోనే ఉంటానని చెప్పి ఉంటే బాగుండేది కానీ అవసరమైతే ఎలుగుబంటిని, ముళ్ళపందినైనా కౌగలించుకొంటానన్నారు. ఆ ఎలుగుబంటి, ముళ్ళపంది మరెవరో కాదు వైసీపీ అని తెలుస్తూనే ఉంది. ఒకవేళ తనకు టికెట్ ఇవ్వకపోతే వైసీపీలోకి వెళ్ళిపోతానని హెచ్చరిస్తున్నట్లున్నాయి ఆయన మాటలు.
కానీ అది ఎలుగుబంటి, ముళ్ళపంది అని తెలిసీ కౌగలించుకొంటే ఎవరికి నష్టం. వాటిని కౌగిలించుకొంటే ఎలా ఉంటుందో వల్లభనేని వంశీని అడిగితే చెపుతారుగా. వైసీపీలో అనేకమంది సీనియర్లే వచ్చే ఎన్నికలలో పోటీ చేయమని చెపుతున్నారంటే ఆ పార్టీ పరిస్థితి అర్దమవుతోంది. అన్నీ తెలిసీ కేశినేని నాని ఆ పార్టీలోకి వెళ్ళాలనుకొంటే నష్టపోయేది ఆయనే తప్ప టిడిపి కాదు కదా?
Shah Rukh Khan’s fans have been eagerly waiting for an update on his next film,…
SS Rajamouli is known for his large-scale filmmaking and carefully planned promotional campaigns. The director…