Telugu

బిహార్ ఎన్నికలు నేర్పిన కొత్త పాఠాలు!

ఏటా దేశంలో ఏదో ఓ రాష్ట్రంలో శాసనసభ లేదా మరో ఎన్నికలు జరుగుతూనే ఉంటాయి. బీహార్‌ ఎన్నికలు కూడా అటువంటివే… అని తీసిపారేయలేము. ఎందువల్లనంటే అవి దేశంలో అన్ని పార్టీలకు, వాటి నాయకులకు కొత్త పాఠాలు నేర్పాయి. ఈ ప్రభావం దేశ రాజకీయాలలో కొన్ని మార్పులు చేర్పులకు దారి తీయవచ్చు కనుక!

కొత్త పాఠాలు:

ADVERTISEMENT

1. రాహుల్ గాంధీ ఓట్లు చోరీ వాదనలతో బిహారీలతో కనెక్ట్ కాలేకపోయారు. కనుక ఇలాంటి ఏదో ఓ పాయింట్ పట్టుకొని ఎంత హడావుడి చేసిన వృధాయే.

2. రాహుల్ గాంధీ మేధావి కావచ్చు. కానీ సామాన్య ప్రజలని అర్ధం చేసుకోవడంలో విఫలం అవుతూనే ఉన్నారు. కనుక రాజకీయాలలో కాలక్షేపం చేయవచ్చు కానీ రాణించలేరు… అని మరోసారి నిరూపితమైంది. (కనుక ఇకనైనా పెళ్ళి చేసుకొని సెటిల్ అయిపోతే మంచిదేమో?)

3. కాంగ్రెస్‌ మూస రాజకీయాలు, ఆలోచనల నుంచి బయటపడాలి. ఆ పార్టీలో వృద్ధ నాయకులు ఈ ఆలోచన కూడా చేయలేరు. ఎవరైనా చేసినా సహించలేరు. కనుక అక్కడి నుంచే ప్రక్షాళన మొదలవ్వాలి.

4. రిస్క్ లేకుండా ఎన్నికల వ్యూహాలు రచించి అమలు చేసి సత్ఫలితాలు సాధించవచ్చు కానీ ఎన్నికల బరిలో దిగి ఒత్తిళ్ళు భరిస్తూ వ్యూహ రచన చేయడం సాధ్యం కాదు… అని ప్రశాంత్ కిషోర్‌కి అర్ధమయ్యే ఉంటుంది. కనుక తనకు ఈ రాజకీయాల కంటే ఎన్నికల వ్యాపారాలే బాగా అచ్చొస్తాయని గ్రహిస్తే, వైసీపీ వంటి పార్టీలు ఉండనే ఉన్నాయి.

5. రాహుల్ గాంధీ చెప్పినట్లు దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలలో లక్షల సంఖ్యలో ‘ఓట్లు చోరీ’ అవుతుండటం నిజమే అయితే, ఇక ఎన్నటికీ కాంగ్రెస్‌ పార్టీ లేదా ఇండియా కూటమి అధికారంలోకి రాలేదు.

6. ఓట్ల చోరీ వ్యవస్తీకృతమైతే భవిష్యత్తులో ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు వెళ్ళాల్సిన అవసరం ఉండక పోవచ్చు.

రాజకీయ మార్పులు చేర్పులు:

1. కీలకమైన బీహార్‌ ఎన్నికలలో ఇండియా కూటమి విఫలమైంది కనుక విచ్చిన్నం అయ్యే అవకాశం ఉంది. ఒకవేళ కలిసి ఉన్నా బలమైన నాయకత్వం లేదు కనుక ఎవరూ దానిని నమ్మరు.

2. వచ్చే ఎన్నికల నాటికి కాంగ్రెస్‌ పార్టీ మరో కొత్త నాయకుడుని వెతికి తెచ్చుకోకపోతే ఘన చరిత్ర కలిగిన కాంగ్రెస్‌ పార్టీ అదే చరిత్రలో కలిసిపోయే ప్రమాదం ఉంటుంది. ఈ విషయం రాష్ట్ర స్థాయి కాంగ్రెస్‌ నేతలు గ్రహిస్తే వారే కొత్త అధిష్టానాన్ని ఏర్పాటు చేసుకున్నా ఆశ్చర్యం లేదు. ఎందుకంటే కాంగ్రెస్‌ గొడుగు కిందే వారి మనుగడ సాగించాలి కనుక.

3. ఓట్ల చోరీ వ్యవస్తీకృతమైతే రాష్ట్ర స్థాయిలో ప్రాంతీయ పార్టీలు తుడిచిపెట్టుకుపోయే ప్రమాదం ఉంటుంది. కనుక వాటి అస్తిత్వం నిలుపుకోవడం కోసం అవి కూడా మరో నాలుగు మెట్లు దిగితే దేశంలో అరాచకం ఏర్పడే ప్రమాదం ఉంటుంది.

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

దుబాయ్‌లో బతుకమ్మకు బీఆర్ఎస్‌ నేతలు.. కవిత ఏమంటారో?

తెలంగాణ సంస్కృతికి అద్దం పట్టే బతుకమ్మ వేడుకలు శనివారం నుంచి మొదలవుతాయి. ఇదివరకు బతుకమ్మ పండుగ, ఆ వేడుకలకు కల్వకుంట్ల…

21 minutes ago

సుప్రీంకోర్టుదే ఆలస్యం.. ప్లాన్-బీ ఉందట!

ఏపీ, తెలంగాణ రాష్ట్రాలలో రాజకీయపార్టీలకు బీసీలు, మైనార్టీల మీద ఎంత ప్రేముందో కొలత వేసి చెప్పడం చాలా కష్టమే కానీ…

21 minutes ago