
“చాలా మంది 20+ టివిఆర్ రేటింగ్స్ వస్తుందని భావించారు. కానీ ఈ సినిమా యూనివర్సల్ జోనర్ కాదని, దీనికి తెలియని కన్నడ హీరో ఉన్నారని గుర్తుపెట్టుకోవాలి. అంతేకాక, ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్ వీడియోలో చాలా నెలలుగా అందుబాటులో ఉంది. ఈ అన్ని అంశాలను పరిశీలిస్తే, 11.9 టీవీఆర్ మంచి రేటింగే”అని ఒక నిపుణుడు చెప్పారు.
అయితే కొందరు మాత్రం ఈ సినిమాకు ఉన్న హైప్, స్టార్ మా చేసిన పబ్లిసిటీకి ఇంకా ఎక్కువ రావాల్సింది అని అంటున్నారు. ఏది ఎలా ఉన్నా.. కెజిఎఫ్ రేటింగ్ తెలుగులో ఇప్పటివరకు ఒక డబ్బింగ్ సినిమాకు వచ్చిన అత్యధిక రేటింగ్ అనే చెప్పుకోవాలి. మరోవైపు.. అభిమానులు చిత్రం రెండో భాగం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఈ చిత్రం దసరా కోసం విడుదల కావాల్సి ఉంది కాని కరోనా బ్రేక్ కారణంగా వాయిదా పడింది. ఇప్పుడు వచ్చే ఏడాది కానీ విడుదల అయ్యే అవకాశం లేదు. బాలీవుడ్ లో మార్కెట్ కోసం సంజయ్ దత్ ని కీలక పాత్ర కోసం తీసుకున్నారు. కేజీఎఫ్ 2 తెలుగు, తమిళం, హిందీ, కన్నడ భాషలలో ఒకేసారి విడుదల కావాల్సి ఉంది. దీనితో కరోనా తరువాత అన్ని భాషలలో మెరుగైన డేట్ రావడం అంత తేలికైన విషయం కాదు.
Chandrababu Naidu has sent a clear message to TDP rebels: withdraw your nominations or face…
కూటమి పొత్తుకు విఘాతం కలగకుండా స్థానిక ఎన్నికలు సజావుగా సాగాలని, పొత్తులో భాగంగా టీడీపీ శ్రేణులు రాజకీయ త్యాగాలకు సిద్ధం…