
కేజీఎఫ్ చాప్టర్ 2వరల్డ్ వైడ్ గా 10,000 స్క్రీన్ ల మీద రిలీజ్ అయినా తొలి కన్నడ మూవీగా చరిత్ర సృష్టించినది. భారీ అంచనాల మధ్య బాక్స్ ఆఫీస్ వద్ద విడుదలైన ఈ సౌత్ సినిమా అటు బాలీవుడ్ ఇండస్ట్రీని షేక్ చేస్తుంది. తొలిరోజే 50కోట్ల గ్రాస్ తో బాలీవుడ్లో తన ప్రభంజనాన్ని కొనసాగిస్తుంది ఈ సినిమా.
కన్నడలో మొదటి రోజు వసూళ్లలో మరేఏ సినిమా అందుకోలేని విధంగా సుమారు 40కోట్ల గ్రాస్ వసూలుచేసినట్లు సమాచారం. టాలీవుడ్ లోను 30కోట్ల గ్రాస్ వసూలుచేసి తన స్టామినాను నిలుపుకున్నాడు రాకీ బాయ్. రానున్న రోజులలో ఆర్ఆర్ఆర్ సినిమా వసూళ్లను దాటి ‘నాన్ కేజీఎఫ్’ రికార్డ్స్ సృష్టిస్తుందేమో ఈ సినిమా చూడాలి అంటున్నారు ట్రేడ్ పండితులు.
ఓవరాల్ గా ఈ సినిమా ఫస్ట్ డే 160+కోట్లగ్రాస్ వసూళ్లు చేసినట్లు ట్రేడ్ వర్గాలలో చర్చ జరుగుతుంది.సినిమా విడుదలైన అన్ని భాషలలోను సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతుంది కేజీఎఫ్ చాప్టర్ 2మూవీ. మొత్తానికి ఈ సౌత్ సినిమాల ప్రభంజనానికి బాలీవుడ్ ప్రేక్షకులు ఫిదా అవుతున్నారని వస్తూన్న వసూళ్ల సునామీతో అంచనావేయవచ్చు.
Anirudh Ravichander is reportedly preparing to marry Kavya Maran in Chennai next month. The composer…
Ravichandran Ashwin believes India's decision to pick Naman Dhir over Tamil Nadu Star Washington Sundar…