
మెగాస్టార్ తో పాటు ‘చందమామ’ కాజల్ కూడా ఉన్న ఈ ఫోటో మెగా ఫ్యాన్స్ కు కన్నుల విందుగా మారింది. ముఖ్యంగా చిరు వయసు అంతకంతకూ తగ్గిపోతున్నట్లుగా ఈ ఫోటోలో కనపడుతున్నాడు. తన కన్నా వయసులో దాదాపు 20 సంవత్సరాలు చిన్నదైన కాజల్ అగర్వాల్ కంటే బెటర్ గా చిరు కనపడుతున్నారని మెగా ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. మరికొందరైతే… ‘ముందుగా రామ్ చరణ్ అనుకున్నామని, కానీ తర్వాత తెలిసింది మెగాస్టార్ అని’ అంటూ సోషల్ మీడియాలో హంగామా చేస్తున్నారు.
స్టిల్స్ తో అభిమానులను పిచ్చెక్కిస్తున్న మెగాస్టార్ ప్రతిష్టాత్మక సినిమా ఆడియో వేడుక లేదని చెప్పడంతో నిరుత్సాహపడిన మెగా ఫ్యాన్స్ కు కొత్త ఏడాదిలో ప్రీ రిలీజ్ వేడుకను భారీగా ఏర్పాటు చేయాలని సన్నాహాలు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఓ భారీ మైదానంలో మెగాస్టార్ స్టామినా ఏంటో మరోసారి రుజువు చేసే విధంగా ఈ వేడుకకు బ్యాక్ గ్రౌండ్ వర్క్ జరుగుతోందట. ముఖ్యంగా బరిలో ఉన్న ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ దగ్గర నుండి భారీ పోటీ ఖాయం కావడంతో, అభిమానులను వీలైనంత హుషారుగా ఉంచేందుకు ‘మెగా’ కాంపౌండ్ సన్నాహాలు చేస్తోందని సమాచారం.
తెలంగాణలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా పాతబస్తీకి పరిమితమైన మజ్లీస్ పార్టీ సహాయసహకారాలు తప్పనిసరి. కనుక మజ్లీస్ అధినేత అసదుద్దీన్…
Becoming a director in the film industry is one thing. Getting someone to trust you…