
జనవరి 11వ తేదీన విడుదలైన ఈ సినిమా ఇప్పటికీ కొన్ని ఏరియాలలో ‘హౌస్ ఫుల్’ కలెక్షన్స్ తో ఆడుతుండడం విశేషం. దీంతో ‘ఖైదీ’ కుమ్ముడుకు బాక్సాఫీస్ బద్ధలవుతోందన్నది లేటెస్ట్ ట్రేడ్ టాక్. ముందుగా అంచనాలు వేసిన ప్రకారం… టాలీవుడ్ అల్ టైం టాప్ 3 సినిమాలలో ఒకటిగా నిలుస్తుందని అంచనాలు వేసినప్పటికీ, తాజాగా రాబడుతోన్న కలెక్షన్స్ తో ప్రిన్స్ “శ్రీమంతుడు” రికార్డులను బద్దలు కొట్టడం ఖాయంగా కనపడుతోంది. ‘జనతా గ్యారేజ్’ ఎంట్రీతో టాప్ 3లో మెగా సినిమాలకు చోటు లేకుండా పోయిన తరుణంలో, కేవలం ఆరు మాసాలలోనే ఓ మెగా సినిమాను టాప్ 2లో నిలబెట్టారు మెగాస్టార్.
అధికారికంగా ఇంకా డిక్లేర్ కాకపోయినప్పటికీ, ఇప్పటికీ వస్తోన్న కలెక్షన్స్ ప్రకారం ‘శ్రీమంతుడు’ రికార్డులను ‘ఖైదీ’ అధిగమించడం నల్లేరు మీద నడకే అని ట్రేడ్ పండితులు చెప్తున్న మాట. అయితే ఓవరాల్ గా చూసుకుంటే… ‘బాహుబలి’ ఆల్ టైం రికార్డుల దరిదాపుల్లోకి రాకపోయినా… కొన్ని ఏరియాలలో మాత్రం బద్దలు కొట్టడం అనేది… కేవలం మెగాస్టార్ స్టామినాగా చెప్పుకోవచ్చు. ఈ సినిమా సాధిస్తున్న రికార్డులతో ‘బాహుబలి’ రికార్డులను అందుకోవడం సాధ్యమేనన్న నమ్మకం టాలీవుడ్ వర్గాల్లో వ్యక్తమవుతోంది. అయితే అసలు ట్విస్ట్ ఏమిటంటే… అది జరిగే కంటే ముందే ‘బాహుబలి 2’తో రాజమౌళి సరికొత్త చరిత్రను సృష్టించడానికి సిద్ధమవుతున్నారు.
The people of Tamil Nadu have delivered a strong mandate against the existing DMK and…
Today marks exactly four years since the release of Sarkaru Vaari Paata, but for the…