
అలాగే, మెగాస్టార్ నోటి వెంట మాస్ డైలాగ్స్ ను వినాలనుకుంటున్న మెగా అభిమానులకు, సినీ ప్రేక్షకులకు ఓ డైలాగ్ తో తన ‘టేస్ట్’ రేంజ్ ఏంటో రుచి చూపించబోతున్నారని తెలుస్తోంది. ఒక్క మాటలో చెప్పాలంటే… మెగా ఫ్యాన్స్ కు కన్నులవిందుగా ఈ టీజర్ ఉండనుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదేమో! ఈ చిన్న టీజర్ తో ఇప్పటికే ఉన్న అంచనాలు మరికొన్ని మెట్లను ఎక్కడం ఖాయమనేది అసలు టాక్. ఈ సమాచారంతో సోషల్ మీడియాలో ‘ధృవ’ రిలీజ్ తో పాటు “ఖైదీ నంబర్ 150” టీజర్ హంగామా కూడా ఎక్కువగా ఉంది.
అన్నట్టు గురువారం నాడు విడుదల కాబోతున్న ఈ టీజర్, శుక్రవారం నుండి “ధృవ” ప్రదర్శితం కానున్న ధియేటర్లలో ప్రదర్శించబోతున్నారు. దీంతో ‘ధృవ’ సినిమా కలెక్షన్స్ పై “ఖైదీ నంబర్ 150” టీజర్ ప్రభావం కూడా ఖచ్చితంగా ఉంటుందని చెప్పవచ్చు. మెగాస్టార్ ను చాలాకాలం తర్వాత వెండితెరపై చూడాలన్న ఆకాంక్ష ఈ 9వ తేదీతో తీరిపోనుంది. ‘బ్రూస్ లీ’ అనేది ఓ చేదు జ్ఞాపకం కావడంతో, ఆ సినిమాను, అందులో మెగాస్టార్ రీ ఎంట్రీని మెగా ఫ్యాన్స్ పూర్తిగా మరిచిపోయారని చెప్పవచ్చు.
గోదావరి జిల్లాలలో ‘పోలవరం పూర్తికాదు.. ఈ పిల్లకి పెళ్ళి కాదు’ అనే నానుడి వినిపిస్తుంటుంది. నాలుగు దశాబ్దాల పాటు నిర్మాణం…
Dulquer Salmaan’s latest Malayalam release I’m Game has exposed a worrying trend. Compared with the…