
ఇక, ఈ టీజర్ హైలైట్స్ గురించి చెప్పుకోవాలనుకుంటే… మొట్టమొదటగా… మెగాస్టార్ లుక్స్ గురించే చెప్పాలి. పదేళ్ళు గడిచిన తర్వాత ఓ ఇరవై ఏళ్ళు వెనక్కి వెళ్ళినట్లుగా ఉన్న చిరు దర్శనానికి మెగా ఫ్యాన్సే కాదు, ఏ సినీ అభిమాని అయినా ఫిదా కావాల్సిందే. ముఖ్యంగా చక్రంలో నుండి తీసిన యాక్షన్ షాట్ అదిరిపోయిందనే చెప్పాలి. అలాగే చిరు యాక్షన్, ఎక్స్ ప్రెషన్స్ లో… ఏ మాత్రం తగ్గకుండా అభిమానులను అలరించే విధంగా ఉన్నాయి.
మెగాస్టార్ తర్వాత టీజర్ లో ఆకట్టుకునే మరో ప్రధాన అంశం దేవిశ్రీప్రసాద్ బ్యాక్ గ్రౌండ్ సంగీతం. అలాగే వినాయక్ టేకింగ్, రత్నవేలు ఫోటోగ్రఫీ, కొణిదెల ప్రొడక్షన్ వాల్యూస్… ఇలా అన్నీ ‘ది బెస్ట్’ అనిపించే రేంజ్ లోనే ఉన్నాయి. అయితే మెగాస్టార్ లుక్స్ తప్ప హీరోయిన్ గానీ, మరే ఇతర క్యారెక్టర్ గురించి ఈ టీజర్లో చూపించలేదు. మెగా అభిమానులకు కన్నులపండుగగా ఉన్న టీజర్, సాధారణ ప్రేక్షకులకు మాత్రం ‘ఓకే’ అంటూ పాస్ మార్కులు మాత్రమే వేయించుకుంటుంది.
గోదావరి జిల్లాలలో ‘పోలవరం పూర్తికాదు.. ఈ పిల్లకి పెళ్ళి కాదు’ అనే నానుడి వినిపిస్తుంటుంది. నాలుగు దశాబ్దాల పాటు నిర్మాణం…
Dulquer Salmaan’s latest Malayalam release I’m Game has exposed a worrying trend. Compared with the…