
మెగాస్టార్ మాస్ స్టెప్పులు వేయడానికి అనుగుణంగా ఈ పాటను దేవిశ్రీ స్వరపరిచినట్లుగా కనపడుతోంది. దేవి సొంతంగా రాసే పాటలు ఎప్పుడూ క్యాచీ లిరిక్స్ తో, నేటితరం మాట్లాడుకునే సహజంగా భాషలో ఉంటాయి, ఈ పాట కూడా అందుకు విరుద్ధంగా ఏమీ లేదు. అయితే, ఈ పాట ‘సన్నాఫ్ సత్యమూర్తి’ సినిమాలో ‘సూపర్ మచ్చి’ పాట మాదిరి ఉండడంతో సంగీత ప్రియులు తీవ్ర నిరుత్సాహానికి గురయ్యారు.
దేవి ట్రాక్ రికార్డును పరిశీలిస్తే… ఆల్బమ్ లో బెస్ట్ సాంగ్ ను దేవి పాడుతుంటారు. నిజంగా ఇదే బెస్ట్ సాంగ్ అయితే మాత్రం, ‘ఖైదీ’ ఆల్బమ్ మెగా అభిమానులను నిరుత్సాహానికి గురిచేయక తప్పదన్న సంకేతాలు వ్యక్తమవుతున్నాయి. పదేళ్ళ తర్వాత రీ ఎంట్రీ ఇవ్వనున్న మెగాస్టార్ ‘రేంజ్’కు తగ్గ సంగీతం కాదన్న విషయాన్ని, ఈ పాట విన్న తర్వాత మెగా అభిమానులు సైతం నిట్టూర్పును ప్రదర్శిస్తున్నారు.
దీంతో ‘ఖైదీ నంబర్ 150’ సినిమాలో విడుదలైన మొదటి పాట శ్రోతల నుండి భిన్న స్పందనలు తెచ్చుకుంది. వినడానికి పాట ఓకే అనిపించేలా ఉందే తప్ప, చిరు స్థాయిని పెంచేదిలా ఉండకపోవడమే ఈ స్పందనలకు కారణం. అయితే విజువల్ గా మెగాస్టార్ తన స్టెప్పులతో దుమ్ము లేపుతారన్న నమ్మకం అయితే ఈ పాటలో విడుదల చేసిన కొన్ని ఫోటోల ద్వారా స్పష్టమైంది. సెంటిమెంట్ ప్రకారం… ‘తమ్ముడు లెట్స్ డు కుమ్ముడు’ అన్న లిరిక్ దగ్గర దేవిశ్రీప్రసాద్ స్పెషల్ ఎంట్రీ ఇవ్వబోతున్నారు.
కూటమి ప్రభుత్వం ఒకేసారి అనేక అభివృద్ధి పనులు సమాంతరంగా, విజయవంతంగా చేస్తూ ముందుకు సాగుతోంది. అలాగే అనేక సంక్షేమ పధకాలు…
The last time YS Jagan took to the streets, he completed the historic Praja Sankalpa…