Telugu

నాడు వెళ్ళిపోదామనుకున్న కియా ఇప్పుడు ఏపీలోనే విస్తరణ!

అనంతపురం జిల్లాలో దక్షిణ కొరియాకు చెందిన ప్రముఖ కార్ల తయారీ సంస్థ ‘కియా’ ఏటా 4.3 లక్షల కార్లు తయారు చేస్తోంది. ఇప్పుడు ఈ సంస్థ మరో రూ.19,000 కోట్ల పెట్టుబడితో ప్లాంట్ విస్తరణకు సిద్ధమైంది.

ప్రస్తుతం ఉన్న ప్లాంట్ సమీపంలోనే కొత్త ప్లాంట్ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఇందుకోసం కియా, దాని అనుబంధ సంస్థలు కలిపి 465 ఎకరాల భూమిని కేటాయించాల్సింది ప్రభుత్వాన్ని కోరాయి. .

ADVERTISEMENT

ఈ కొత్త ప్లాంట్ ఉత్పత్తి ప్రారంభిస్తే ఏడాదికి మరో రెండు లక్షల కార్లు తయారవుతాయి. 2030 ప్రారంభం నాటికి కొత్త ప్లాంట్‌లో ఉత్పత్తి ప్రారంభించాలని కియా లక్ష్యంగా పెట్టుకుంది. ఈ ప్రాజెక్టు ద్వారా సుమారు 12 వేల మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని అంచనా.

నవంబర్ 12న విశాఖపట్నంలో జరిగిన సీఐఐ భాగస్వామ్య సదస్సులో ఈ మేరకు ఒప్పందంజరిగింది. అయితే కియా కంపెనీ అంత భారీ పెట్టుబడితో ప్లాంట్ విస్తరణకు సిద్ధపడటం మాత్రమే ప్రధాన విషయం కాదు.

రాష్ట్ర విభజన తర్వాత సీఎం చంద్రబాబు నాయుడు చొరవ, కృషి కారణంగా కియా కంపెనీ ఏపీకి వచ్చింది. కానీ వైసీపీ అధికారంలోకి వచ్చాక కియా అనేక సమస్యలు ఎదుర్కొంది. జగన్‌ అధికారంలోకి వచ్చిన మరుసటి ఏడాదిలోనే అంటే 2020లో కియా ప్లాంట్‌ను తమిళనాడుకు తరలించబోతున్నట్లు వార్తలు వచ్చాయి.

దీనిపై అప్పట్లో పెద్ద రాజకీయ వివాదం చెలరేగింది. జగన్ ప్రభుత్వం పరిశ్రమలను ఇబ్బంది పెడుతోందంటూ టీడీపీ తీవ్ర విమర్శలు చేసింది. అప్పుడు జగన్‌ స్వయంగా పూనుకొని దానికి ఉపశమనం కలిగించారు. లేకుంటే నేడు ఈ కియా కంపెనీ, ఈ భారీ పెట్టుబడితో విస్తరణ, వాటిలో ఉద్యోగాలు అన్నీ పొరుగు రాష్ట్రానికి దక్కి ఉండేవే!

ఇప్పుడు అదే కియా కంపెనీ ఏపీలో రెండో ప్లాంట్ ఏర్పాటు చేయడానికి భారీ పెట్టుబడితో ముందుకు వచ్చింది. అంటే రాజకీయ, పారిశ్రామిక వాతావరణంలో వచ్చిన సానుకూల మార్పుకు ఇది సంకేతంగా చూడవచ్చు.

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాత స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌కు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారు. పారిశ్రామిక అభివృద్ధికి అనుకూలమైన విధానాలను అమలు చేయడంపై దృష్టి పెట్టారు.

ఈ నేపథ్యంలో రాష్ట్రానికి భారీ పెట్టుబడులు వస్తున్నాయి. గూగుల్, రిలయన్స్, అదానీ వంటి అనేక ప్రముఖ సంస్థలు ఏపీ పెట్టుబడులకు ముందుకు వస్తున్నాయి. ఇప్పుడు కియా విస్తరణ కూడా రాష్ట్రంలో సానుకూల వాతావరణం ఉందని సూచిస్తోంది.

ఒక అంతర్జాతీయ కంపెనీ ఇప్పటికే ఉన్న ప్లాంట్‌ను విస్తరించడానికి మళ్ళీ వేల కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టడానికి ముందుకు రావడం ప్రభుత్వంపై దానికి ఉన్న నమ్మకమే కారణం. భవిష్యత్తులో కూడా ఇటువంటి రాజకీయ, పారిశ్రామిక వాతావరణం కొనసాగుతుందనే నమ్మకం ఏర్పడటం వల్లనే, భారీ పెట్టుబడులతో రాష్ట్రంలో పరిశ్రమలు ఏర్పాటవుతున్నాయని వేరే చెప్పక్కరలేదు.

అయితే పెట్టుబడిదారుల నమ్మకం పోనేందుకు మంచి పారిశ్రామిక విధానం ఒక్కటే సరిపోదు. రాష్ట్రంలో రాజకీయ సుస్తిరత కొనసాగుతుందనే నమ్మకం కూడా కలిగించాలి. సీఎం చంద్రబాబు నాయుడు వారికి ఆ నమ్మకం కలిగించారు. ఇందుకు కియా విస్తరణ తాజా నిదర్శనం.

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

Enough of Satya? Tollywood Needs Abhinav Gomatam Now

Telugu cinema is currently going through its worst spell for comedy. There was a time…

24 minutes ago

Did Dhanush Need an Epic Disaster? Strange BO Logic

Dhanush's most anticipated film Om directed by Rajkumar Periyasamy, was finally released in theatres yesterday,…

54 minutes ago