తమిళ సినిమాలకు తెలుగు రాష్ట్రాలలో రెడ్‌ కార్పెట్….

సినిమాలకు భాష, ప్రాంతం, కులమతాల బేధం ఉండదు. ఒక సినిమాలో వివిధ రాష్ట్రాలకు, కులమతాలు, భాషలకు చెందినవారు కలిసికట్టుగా పనిచేస్తుంటారు. అందరినీ కలిపేవి సినిమాలు. కనుక అభిమానులు పరస్పరం కీచులాడుకోకుండా అందరి సినిమాలను సమానంగా ఆదరించాలని పవన్‌ కళ్యాణ్‌ స్వయంగా విజ్ఞప్తి చేశారు.

ఆయన చెప్పిన ఈ మాటలు అక్షరాల నిజమే. అయితే వాస్తవ పరిస్థితులు ఎప్పుడూ దీనికి భిన్నంగానే ఉంటాయని అందరికీ తెలుసు.

ADVERTISEMENT

ఇటీవల యువ నటుడు కిరణ్ అబ్బవరం తాజా ఇంటర్వూలో, “తమిళ సినిమాలను మన రెండు తెలుగు రాష్ట్రాలలో తెలుగు సినిమాలతో సమానంగా ఆదరిస్తుంటాము. కానీ మన తెలుగు సినిమాలకు తమిళనాడులో థియేటర్స్ కూడా ఇవ్వరు. ఇదివరకు నా సినిమా ఒకటి తమిళనాడులో రిలీజ్ చేసుకోవాలనుకుంటే అక్కడి డిస్ట్రిబ్యూటర్లు నిర్మొహమాటంగా తెలుగు సినిమాలకు థియేటర్లు దొరకవని చెప్పేశారు.

ఇది హీరోలందరికీ వర్తించకపోవచ్చు కానీ నా స్థాయి నటులకు ఖచ్చితంగా వర్తిస్తుందని స్పష్టమైంది. కానీ మనం చిన్నా పెద్దా అనే తేడా చూడకుండా తమిళ నటుల సినిమాలను ఆదరిస్తుంటాము. తమిళ నటుడు ప్రదీప్ రంగనాథ్ నటించిన ‘డూడ్‌’ సినిమా ఇందుకు తాజా నిదర్శనం. కానీ మన తెలుగు సినిమాలకు తమిళనాడులో థియేటర్లు ఎందుకు ఇవ్వరు?ఇవ్వకపోతే ఎవరికీ చెప్పుకోవాలి?” అనే కిరణ్ అబ్బవరం ప్రశ్నకు సమాధానం లభించదు.

అయితే రెండు తెలుగు రాష్ట్రాలలో చిన్న సినిమాలకు థియేటర్లు లభిస్తున్నాయా? వారు కోరుకొన్న సమయానికి ఎటువంటి సమస్యలు లేకుండా సినిమాలు రిలీజ్ చేసుకోగలుగుతున్నారా? అంటే కాదనే అంటారు అనేక మంది చిన్న సినిమా నిర్మాతలు, నటీనటులు.

పెద్ద హీరో సినిమాలు వరుసగా రిలీజ్ అవుతుంటే, థియేటర్లన్నీ వారికే కేటాయిస్తారు. ఆ కారణంగా చిన్న సినిమాలు వారాలు ఒక్కోసారి నెలల తరబడి వాయిదా వేసుకోవలసి వస్తుంటుంది.

తెలుగు రాష్ట్రాలలోనే చిన్న సినిమాలకు, యువ హీరోలకు ఇటువంటి దుస్థితి నెలకొన్నప్పుడు పొరుగు రాష్ట్రంలో గౌరవ మర్యాదలు లభిస్తాయా?

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

Rohit’s 2027 WC Spot: Cricket Legend Warns BCCI

Rohit Sharma and Virat Kohli have retained their places in India’s ODI squad for the…

32 minutes ago

Money And Lands: KTR’s Old Videos Viral Now!

Telangana politics have started to revolve around the discussion on lands and illegal monetary gains…

1 hour ago