
తెలంగాణలో బిజెపికి జీవం పోసి బిఆర్ఎస్కు ప్రత్యామ్నాయంగా నిలబెట్టిన క్రెడిట్ ఖచ్చితంగా బండి సంజయ్‌దే. అయితే పార్టీలో అందరినీ కలుపుకుపోవడం లేదని సీనియర్ నేతల పిర్యాదుల కారణంగా ఆయనను తప్పిస్తున్నట్లు తెలుస్తోంది. కానీ ఈ నాలుగేళ్ళలో తెలంగాణలో బిజెపిని ఎంతగానో బలపరిచి ఎన్నికలకు సిద్దం అవుతుండగా బండి సంజయ్‌ని అకస్మాత్తుగా ఆ పదవిలో నుంచి తప్పించడంపై పార్టీ కార్యకర్తలు అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది.
పార్టీ నేతల మద్య కీచులాటలు, మరో 4-5 నెలల్లోనే తెలంగాణ శాసనసభ ఎన్నికలు జరుగబోతుండటంతో ఇంత తక్కువ సమయంలో పార్టీని చక్కదిద్దుకొని బిఆర్ఎస్ను ఎదుర్కోవడం చాలా కష్టం కనుక కిషన్‌రెడ్డి కూడా ఈ పదవి చేపట్టేందుకు ఆసక్తి చూపలేదు కానీ అధిష్టానం ఆదేశం మేరకు అంగీకరించిన్నట్లు తెలుస్తోంది.
చాలా దూకుడుగా వ్యవహరిస్తూ కేసీఆర్ ప్రభుత్వాన్ని, బిఆర్ఎస్ పార్టీకి చెమటలు పట్టిస్తున్న బండి సంజయ్‌ని తప్పించి, మృధుభాషి అయిన కిషన్ రెడ్డిని నియమించడం వలన తెలంగాణ బిజెపిలో లుకలుకలు తగ్గుతాయేమో కానీ బండి సంజయ్ అంత దూకుడుగా ఆయన కేసీఆర్‌ని, మంత్రులు, ఎమ్మెల్యేలను ఎదుర్కొలేకపోవచ్చు. ఈ మార్పు బిజెపి కార్యకర్తలలో అసంతృప్తి కలిగించడం ఖాయమే. కనుక బిజెపిలో ఈ పరిణామాలు అధికార బిఆర్ఎస్ పార్టీకి వరంగా మారుతాయని భావించవచ్చు.
Andhra Pradesh's municipal election campaign has barely begun, but the first day of nominations has…
Sai Dharam Tej is pinning big hopes on Sambarala Yeti Gattu. Made on the biggest…