
ప్రిన్స్ మహేష్ బాబుతో ఓ సినిమా చేయాలనేది తన డ్రీం అని, సరైన కధ, దర్శకుడు కుదిరితే ప్రిన్స్ ఎప్పుడంటే అప్పుడు తానూ సిద్ధమని, అయితే ఎలాగైనా మహేష్ ఓ సినిమాను నిర్మించాలనేది తన టార్గెట్ అన్నట్లుగా రాధామోహన్ చెప్పుకొచ్చారు. మరి మహేష్ బాబు వంటి స్టార్ హీరోతో సినిమా నిర్మించాలన్న అభిప్రాయంతో ఉన్న సదరు నిర్మాత, ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ వంటి చిన్న సినిమాను ఎందుకు నిర్మించాల్సి వచ్చిందో కూడా తెలిపారు.
ఈ సినిమా కధే తనను ప్రోత్సహించిందని, దర్శకుడు సినిమాను చాలా వినోదాత్మకంగా తెరకెక్కించారని అన్నారు. తానూ నటించిన సినిమాలు సక్సెస్ కాలేదన్న సెంటిమెంట్ ఒక వైపు, తానూ నటించని ‘బెంగాల్ టైగర్’ సక్సెస్ కావడం మరో వైపు ఉండడంతో, ఈ సినిమాలో కూడా సెంటిమెంట్ రీత్యా తానూ నటించలేదని రాధామోహన్ తెలిపారు. ఇండస్ట్రీలో ఇలాంటి సెంటిమెంట్లు సాధారణమే కదా!
Allu Arjun’s Forbes India feature was meant to highlight his growing pan-India popularity. Instead, a…
For Allari Naresh, Ramba Oorvasi Menaka is more than just another comedy outing. It marks…