
వైసీపీలో మంచి నోరున్న నేతగా మాజీ ఎమ్మెల్యే కొడాలి నాని పేరు సంపాదించుకున్నారు. శాసనసభలో జగన్ సమక్షంలోనే చంద్రబాబు నాయుడుని, ఆయన సతీమణి భువనేశ్వరిపై చాలా అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు ఆయన పేరు నారా లోకేష్ వ్రాసుకున్న ‘రెడ్‌బుక్’లోకి ఎక్కింది.
ఎన్నికలలో ఓడిపోయినప్పటి నుంచి ఆ భయంతోనే కొడాలి నాని మీడియాకు, చివరికి వైసీపీ పార్టీ కార్యక్రమాలకు కూడా దూరంగా ఉంటున్నారు.
ఓ మహిళా టీవీ జర్నలిస్ట్ ఇదే విషయం ఆయనని సూటిగా అడిగితే కొడాలి నాని ఎప్పటిలాగే తన పద్దతిలో జవాబులు చెప్పి తప్పించుకున్నారు.
“గతంలోలా ఇప్పుడు ఎందుకు మీడియా ముందుకు వచ్చి మాట్లాడటం లేదు?” అని జర్నలిస్ట్ ప్రశ్నించగా, “నీ ఉద్యోగం పీకేస్తే నువ్వు ఇలాగే మైకు పట్టుకొని తిరుగుతావా? ప్రజలు నా ఉద్యోగం కూడా పీకేశారు కనుకనే మాట్లాడటం లేదు తప్ప వేరే కారణం లేదు,” అని కొడాలి నాని అన్నారు.
“రెడ్‌బుక్‌లో మీ పేరుందని భయపడుతున్నారా?”అనే ప్రశ్నకు “రెడ్‌బుక్‌లో నా పేరుందని ఎవరైనా చెప్పారా?ఆ రెడ్‌బుక్ నీకు చూపించారా?” అని ఎదురు ప్రశ్నిస్తూ, “కేసులు, అరెస్టులకు భయపడేవాడిని కాను. రాజకీయాలలో ఇవన్నీ మామూలే,” అని కొడాలి నాని జవాబిచ్చారు.
ప్రజలు తన రాజకీయ ఉద్యోగం పీకేసినందునే రాజకీయాలకు దూరంగా ఉన్నానని, కేసులు, అరెస్టులు అంటే తనకు భయం లేదని కొడాలి నాని చెప్పడం చాలా హాస్యాస్పదంగా ఉంది.
వైసీపీలో చాలా మంది నేతలు నిత్యం మీడియా ముందుకు వచ్చి సిఎం చంద్రబాబు నాయుడుని, కూటమి ప్రభుత్వాన్ని విమర్శిస్తూనే ఉన్నారు. కనుక ఒకవేళ కొడాలి నానికి కూడా అరెస్ట్ భయం లేకపోయుంటే ఎప్పటిలాగే రాజకీయాలు చేసుకునేవారు కదా?కానీ వైసీపీ కార్యక్రమాలకు కూడా దూరంగా ఉంటున్నారు కదా?
తాను మౌనంగా, రాజకీయాలకు దూరంగా ఉండిపోయినంత మాత్రాన్న రెడ్‌బుక్‌లో పేరు కొట్టేయరని కొడాలి నానికి తెలుసు. కనీసం వెంటనే తన డేట్ వచ్చేయకుండా ఉంటుందని ఆశ పడుతున్నట్లున్నారు పాపం!
BOTTOM LINE An Absolute Disaster, Nothing Works PLATFORM Netflix RUNTIME 2 Hours What Is the…
The theatrical version of The Paradise may not be the final version audiences get to…