
ఈ ఏడాది సంక్రాంతి పండుగకి గుడివాడలో క్యాసినో ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. కొడాలి నాని స్పాన్సర్ చేసిన ఆ క్యాసినోకి హైదరాబాద్‌లో నివశిస్తున్న క్యాసినో నిర్వాహకుడు చికోటి ప్రవీణ్ నిర్వహించారని టిడిపి సీనియర్ నేత వర్ల రామయ్య అన్నారు. మొన్న ప్రవీణ్ ఇళ్ళు, కార్యాలయాలపై దాడులు చేసిన ఈడీ అధికారులు త్వరలో కొడాలి నాని ఇంటి తలుపు తట్టడం ఖాయమని అన్నారు. త్వరలో కొడాలి నానితో పలువురు వైసీపీ నేతలు జైలుకి వెళ్ళక తప్పదని వర్ల రామయ్య అభిప్రాయం వ్యక్తం చేశారు.
దాంతో కొడాలి నాని మళ్ళీ తన నోటికి పని చెప్పారు. విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ, “పనీ పాటు లేని నలుగురు 420 గాళ్ళు, సన్నాసులు, లుచ్చాగాళ్ళు ఊసుపోక, తిన్నది అరక్క కాలక్షేపం కోసం వాళ్ళ మీడియా ముందు కూర్చొని నా గురించి అడ్డమైన వాగుడు వాగారు. వాళ్ళు నిజంగా మొగాళ్ళే అయితే, వాళ్ళకి నిజంగా దమ్ముంటే గుడివాడలో క్యాసినో గురించి ఈడీకి నాపై ఫిర్యాదు చేయాలి. నన్ను ఎవరు అరెస్ట్ చేస్తారో నేను చూస్తాను,” అంటూ సవాల్ విసిరారు.
టిడిపి, వైసీపీ నేతల రాజకీయాలు, సవాళ్ళు, ప్రతి సవాళ్ళు పక్కన పెడితే, క్యాసినో కింగ్స్ గా పేరుగాంచిన చికోటి ప్రవీణ్, మాధవ్ రెడ్డిల వరకు వచ్చిన ఈడీ బృందాలు, మద్యలో కేంద్ర ప్రభుత్వం కలుగజేసుకోకుండా ఉంటే కొడాలి నాని వరకు రాకమానవు.
The trailer of Drishyam 3 starring Mohanlal and directed by Jeethu Joseph was released recently…
తమిళనాడు మొత్తం ఎంతో ఆసక్తికరంగా ఎదురుచూస్తున్న విజయ్ ప్రమాణ స్వీకారం కూడా పూర్తయింది. జోసెఫ్ విజయ్ అనే నేను అంటూ…