
ఇంతకీ విషయం ఏమిటంటే, గుడివాడలో ఈరోజు ఉదయం ఓ ఫ్లెక్సీ బ్యానర్ వెలిసింది. దానిలో తెలంగాణ సిఎం కేసీఆర్, మంత్రులు కేటీఆర్, హరీష్ రావుల ఫోటోలతో “టిఆర్ఎస్ను బిఆర్ఎస్గా మార్చి జాతీయ రాజకీయాలలో ప్రవేశించబోతున్న తెలంగాణ ముఖ్యమంత్రివర్యులు శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ గారికి ఇవే మా శుభాకాంక్షలు,” అంటూ వ్రాసి కిందన ‘కేటీఆర్ యూత్’ అని వ్రాశారు.
అంటే గుడివాడలో కేటీఆర్ని అభిమానించే యువకులు ఈ పోస్టర్ పెట్టినట్లు అర్దమవుతోంది. అయితే మరోవైపున ‘రవి స్వీట్స్ అండ్ బేకరీ’ అని కూడా ముద్రించారు.
సిఎం కేసీఆర్ బిఆర్ఎస్తో ఏపీకి వచ్చినా ఇక్కడ ఆయనకు అభ్యర్ధులు దొరకరు… ప్రజలు కూడా పట్టించుకోరని కొడాలి నాని నాలుగు రోజుల క్రితమే అన్నారు. ఆయన ఆ మాట అన్న నాలుగు రోజులకే గుడివాడలోనే ఈ పోస్టర్ ప్రత్యక్షమవడం ఆయనకు పెద్ద షాక్ అనే చెప్పవచ్చు.
ఏపీలో బిఆర్ఎస్ వచ్చినా దాంతో ఇబ్బంది లేదని కొడాలి నాని స్వయంగా అన్నారు కనుక ఇప్పుడు ఈ పోస్టర్పై కూడా ఆయన అభ్యంతరం చెప్పలేరు. ఇంతకీ కొడాలి నానికి ఈ స్వీట్ షాక్ ఇచ్చింది… గుడివాడలోని కేటీఆర్ యూతా… లేక స్వీట్ షాప్ యజమానా?ఎవరినప్పటికీ కొడాలి నానికి ఈ స్వీట్ అరిగించుకోవడం కష్టమే.
ఒక్కోసారి నెగెటివ్ పబ్లిసిటీ కూడా సినిమాలు నిలద్రొక్కుకునేందుకు తోడ్పడుతుంటుంది. అదేవిధంగా మున్సిపల్ ఎన్నికలలో టీడీపి-జనసేన సీట్ల సర్దుబాట్లు, వాటిపై వినిపిస్తున్న…
Prabhas and director Sandeep Reddy Vanga have come together for the first time for the…