
జూ.ఎన్టీఆర్, కొడాలి నాని మధ్య ఉన్న సాన్నిహిత్యం అందరికి తెలిసిందే. అయితే అది ఒక్కప్పటి బంధం ఉన్నంత బలంగా ఉందా లేదా అనేది మాత్రం పలు సందర్భాలలో సందేహాలకు తావునిస్తుంది. చంద్రబాబు సతీమణి,ఎన్టీఆర్ కూతురైన భువనేశ్వరి విషయంలో కొడాలి.., వల్లభనేని వంశీ పై జూ.ఎన్టీఆర్ చేసిన విమర్శలు ఇటువంటి సందేహాలకు ఊతాన్నిస్తున్నాయి.
ఆనాడు ఎన్టీఆర్ తో ఉన్న స్నేహం కారణంగా టీడీపీ పార్టీలో ఎదిగిన కొడాలి అదే స్నేహం అడ్డంపెట్టుకుని ఎన్టీఆర్ పై ప్రేమ కురిపిస్తూ చంద్రబాబుని కార్నర్ చేస్తుంటారు. టీడీపీ నేతల బద్ద శత్రువు పై కాలేసి కూర్చున్న జూ.ఎన్టీఆర్ ఫోటోలను చూస్తూ కొందరు టీడీపీ కార్యకర్తలు “వీడు మగాడ్రా బుజ్జి” అంటూ కొడాలి పై తమ ఆవేశాన్ని పంచుకుంటున్నారు. మరికొంతమంది వైసీపీ కార్యకర్తలు మాత్రం వీరి మధ్య ఉన్న అన్యోన్యతను అర్ధం చేసుకోవాలంటూ ఎవరికీ నచ్చిన విధంగా వారు తమదైన ఆలోచనలను వ్యక్తపరుస్తున్నారు.
ఏదిఏమైనప్పటికీ ఎదో కారణంగా.., ఆస్కార్ రేసులో జూ.ఎన్టీఆర్ అంటూ., అమితాషా తో జూ.ఎన్టీఆర్ భేటీ అంటూ., ఇప్పుడు ఇలా పాత పిక్స్ వైరల్ గా మారడంతో అయితేనే తమ అభిమాన నటుడు నిత్యం వార్తలలో., సోషల్ మీడియాలో ట్రెండ్ అవడం మాత్రం జూ.ఎన్టీఆర్ అభిమానులు పండగ చేసుకుంటున్నారు.
Venkatesh-Trivikram's Aadarsha Kutumbam AK47 is now expected to arrive in theatres on October 30, after…
Bigg Boss Telugu is one of the most entertaining reality shows in the world. The…