
వైసీపీ లో వారసత్వ రాజకీయాలు ఊపందుకుంటున్నాయా.? ఒక్కొక్కరుగా నాయకులు తమ రాజకీయ వారసులను ప్రకటిస్తూ ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకుంటున్నారా.? ఇందుకు మచిలీపట్టణం వైసీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి పేర్ని నాని పునాది వేసారా.?
అవును 2019 ఎన్నికలలో మచిలిపట్నం వైసీపీ ఎమ్మెల్యే గా నెగ్గిన పేర్ని నాని జగన్ కు నమ్మిన బంటులా పనిచేసారు. కాపు సామాజికవర్గానికి చెందిన నేతగా ఉన్న పేర్ని అదే సామాజికవర్గం నుంచి వచ్చిన జనసేనాని పవన్ కళ్యాణ్ పై పరిధి దాటి విమర్శలు గుప్పించారు.
చివరికి 2024 ఎన్నికల నుంచి పక్కకు తప్పుకుంటూ ప్రత్యక్ష రాజకీయాలకు గుడ్ బై చెప్పారు.ఆ లగే తన రాజకీయ వారసుడిగా తన కుమారుడు పేర్ని కిట్టు ని రంగంలోకి దింపారు. దానితో 2024 ఎన్నికలలో బందరు వైసీపీ ఎమ్మెల్యే గా టీడీపీ అభ్యర్థి కొల్లు రవీంద్ర పై ఎన్నికల బరిలో కి దిగారు పేర్ని కిట్టు.
అయితే పేర్ని నాని తాలూకా రాజకీయ ఫలితాన్ని పేర్ని కిట్టు అనుభవించాల్సి వచ్చింది. దీనితో కిట్టు రాజకీయ అరంగేట్రం ఓటమితో స్వాగతం పలికింది. అలాగే ఇప్పుడు మరో కరుడు కట్టిన వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని రాజకీయ వారసుడు చర్చ ను కూడా పేర్ని నాని తెరమీదకు తెచ్చారు.
కొడాలి నాని కి ఇద్దరు కుమార్తెలే కావడం, వారికీ రాజకీయాల మీద పెద్దగా ఆసక్తి లేకపోవడంతో కొడాలి తమ్ముడు కుమారుడు కొడాలి అర్జున్ కొడాలి నాని రాజకీయ వారసత్వాన్ని కొనసాగించనున్నారు అంటూ పేర్ని నాని ప్రకటించారు.గుడివాడలో SIR పై జరిగిన వైసీపీ నాయకుల సమావేశంలో పేర్ని నాని ఇటువంటి కిఆల్క వ్యాఖ్యలు చేసారు.
2034 ఎన్నికలలో గుడివాడ వైసీపీ అభ్యర్థిగా కొడాలి అర్జున్ బరిలోకి దిగనున్నారు అంటూ పేర్ని నాని కొడాలి నాని ముందు చేసిన ప్రకటన ఇప్పుడు కొడాలి అభిమానులతో పాటుగా గుడివాడ నియోజకవర్గంలో కూడా చర్చ నీయాంశంగా మారింది.
కొడాలి నాని కూడా పేర్ని నాని మాదిరి ప్రత్యక్ష రాజకీయాలకు గుడ్ బై చెప్పనున్నారా.? అందుకే పేర్ని నాని ప్రకటనల ద్వారా తన స్థానంలో తన తమ్ముడు కుమారుడిని గుడివాడ ప్రజలకు పరిచయం చేస్తున్నారా.? అలాగే కొడాలి అర్జున్ కొడాలి నాని రాజకీయ వారసత్వాన్ని మాత్రమే కొనసాగిస్తారా.? లేదా కొడాలి వాడే బూతు రాజకీయాన్ని కూడా ముందుకుతీసుకెళ్తారా.? ఇలా ఎన్నో ప్రశ్నలకు సమాధానాలు కావాలి.
మరి ఆ సమాధానాలు కొడాలి నుంచి వస్తాయా.? లేదా పేర్ని నుంచి వస్తాయా.? నేడు చూడాలి. అలాగే పేర్ని చేసిన ఈ రాజకీయ వారసుడి ప్రకటన కొడాలి ఇష్టపూర్వకంగా జరిగిన ప్రకటనేనా.? లేదా పేర్ని నాని ప్రదర్శించిన అత్యుత్సాహమా.?
Venkatesh’s much-hyped Aadarsha Kutumbam AK 47, directed by Trivikram, has been indefinitely postponed. Producer Naga…
The Ministry of External Affairs in India has amended the passport rules for minors of…