మాజీ బూతుల మంత్రి కొడాలి నాని మళ్ళీ నోరు జారడంతో మంగళవారం టిడిపి అధ్వర్యంలో తెలుగు మహిళలు గుడివాడలో ఆయన ఇంటిని చుట్టుముట్టేందుకు బయలుదేరారు. కానీ ఈ విషయం ముందే తెలుసుకొన్న పోలీసులు దారిలోనే వారిని అడ్డుకొన్నారు.
ఈ సందర్భంగా వారికీ, పోలీసులకి మద్య వాగ్వాదం జరిగింది. మహిళలను కించపరుస్తూ మాట్లాడిన కొడాలి నాని అక్కడికి వచ్చి బేషరతుగా క్షమాపణ చెప్పేవరకు అక్కడి నుంచి కదలబోమని చెప్పి తెలుగు మహిళలు రోడ్డుపై బైటాయించి ధర్నా చేశారు. దాంతో పోలీసులు వారిని బలవంతంగా ఈడ్చుకొని తీసుకువెళ్ళి వాహనాలలో ఎక్కించి పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
ADVERTISEMENT
వారికి సంఘీభావం తెలిపేందుకు వచ్చిన గుడివాడ టిడిపి ఇన్‌ఛార్జి రావి వెంకటేశ్వరరావుని కూడా పోలీసులు అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
ADVERTISEMENT



