
గుడివాడలో జరిగిన ఘటనలపై తమ దగ్గర పూర్తి ఆధారాలు ఉన్నాయని, పెట్రోల్ డబ్బాలను తామే తీసుకువస్తామని, నిరూపిస్తే కొడాలి నాని తగల పెట్టుకోవాలని, ఒకవేళ నిరూపించలేని పక్షంలో ఆ పెట్రోల్ డబ్బాలతో తమను తామే తగల పెట్టుకుంటామని, దీనికి కొడాలి నాని సిద్ధమా? అంటూ సవాల్ చేసారు బొండా ఉమా.
డేట్, టైం కొడాలి నాని ఫిక్స్ చేసినా, తమను నిర్ణయించమని చెప్పినా ఓకే అని చెప్పిన ఉమా, దొరికిపోయిన దొంగగా కొడాలి నానిని అభివర్ణించారు. కే కన్వెన్షన్ సెంటర్ లో తనిఖీకి తాము వెళితే ప్రభుత్వం వణికిపోయిందని బొండా ఉమా చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా పెట్రో మంటలను రేపుతున్నాయి.
ఇదిలా ఉంటే అసలే పెట్రోల్ ధరలు మండిపోతుంటే ఈ తగలపెట్టుకునే కార్యక్రమాలేంటి? అంటూ సోషల్ మీడియా జనులు సెటైర్లు వేస్తున్నారు. వైసీపీ నేతలు మరియు కొడాలి నాని అనుచరులతో కూడిన వీడియోలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్న నేపథ్యంలో ఈ సవాళ్ల కార్యక్రమం ఎందులకు?
Nani and OG director Sujeeth have teamed up for Bloody Romeo, a stylish action film…
A H-1B tech worker's post on Reddit, where she plans for the future amidst layoffs…