
కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారంలో ప్రతిపక్షాలు రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ప్రతిపక్షాలు అడ్డుకున్నాయి. హైకోర్టు, సుప్రీంకోర్టు తెలంగాణ ప్రభుత్వానికి మొట్టికాయలు వేశాయి. ప్రధాని మోడీ కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని తప్పు పట్టారు. కనుక ఈ వ్యవహారంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి గట్టి ఎదురుదెబ్బలు తగులుతున్నాయని స్పష్టమైంది.
అయితే ఈ వ్యవహారంపై ప్రధాని మోడీ స్పందించడంతో బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దీనిని ఓ గొప్ప అవకాశంగా భావించి నేరుగా ఆయనకే ట్వీట్ చేశారు.
“ఈ వ్యవహారంపై మీరు స్పందించడం నాకు చాలా సంతోషం కలిగించింది. కానీ ఇది కేవలం మొక్కుబడి ఖండన కాదని భావిస్తున్నాను. దీనిలో రూ.10,000 కోట్ల కుంభకోణం జరిగింది కనుక ఈ వ్యవహారంపై సీబీఐ తదితర దర్యాప్తు సంస్థల చేత విచారణ జరిపించి మీ నిబద్దత చాటు కుంటారని ఆశిస్తున్నాను,” అంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు.
తెలంగాణ ప్రభుత్వాన్ని కూలచేస్తామని కేటీఆర్ పదేపదే చెప్పారు. కనుక ఈ పేరుతో కేంద్రంతో చేతులు కలిపి తమ ప్రభుత్వాన్ని అస్థిర పరిచేందుకు బిఆర్ఎస్ పార్టీ కుట్రలు చేస్తోందని కాంగ్రెస్ మంత్రులు ఆరోపిస్తున్నారు. బీజేపి, బిఆర్ఎస్ పార్టీలు పైకి కత్తులు దూసుకుంటున్నట్లు నటిస్తున్నప్పటికీ రెండూ పరస్పరం సహకరించుకుంటున్నాయని కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తోంది.
కానీ బిఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలే కుమ్మకు అయ్యాయని అందుకే కేసీఆర్, కేటీఆర్‌లపై ఎన్ని కేసులు నమోదు చేసినా రేవంత్ రెడ్డి ప్రభుత్వం వారిపై ఎటువంటి చర్యలు తీసుకోవడంలేదని బీజేపి వాదిస్తోంది. డీలిమిటేషన్ ప్రతిపాదనని వ్యతిరేకిస్తూ ఇటీవల తమిళనాడు సిఎం స్టాలిన్ చెన్నైలో సమావేశం ఏర్పాటు చేయగా, దానికి సిఎం రేవంత్ రెడ్డి, కేటీఆర్ ఇద్దరూ కలిసే వెళ్ళారని కనుక కాంగ్రెస్, బిఆర్ఎస్ పార్టీల మద్య రహస్య బంధం ఉందనడానికి ఇంతకంటే గొప్ప నిదర్శనం ఎముతుందని బీజేపి ప్రశ్నిస్తోంది.
సిఎం రేవంత్ రెడ్డి మంత్రివర్గ విస్తరణ చేపట్టకుండా తాత్సారం చేస్తున్నందుకు ఆ పదవులు ఆశిస్తున్న నేతలు పార్టీపై తీవ్ర అసంతృప్తిగా ఉన్నారు. హైడ్రా కూల్చివేతలు, ఇప్పుడు ఈ గచ్చిబౌలి భూముల వ్యవహారంతో పార్టీ నేతలో మరింత అసంతృప్తి నెలకొంది.
తెలంగాణ రాజకీయాలపై మళ్ళీ పట్టు బిగించాలని బీజేపి అధిష్టానం భావిస్తోంది. రాష్ట్రంలో బిఆర్ఎస్ పార్టీ మళ్ళీ పుంజుకుంటోంది. కనుక కాంగ్రెస్ పార్టీలో అసంతృప్తిని మంచి అవకాశంగా మలుచుకోవచ్చని బిఆర్ఎస్ పార్టీ భావించడం సహజం.
కనుక ఈ కంచ గచ్చిబౌలి భూముల వ్యవహరం బీజేపి, బిఆర్ఎస్ పార్టీలను కలుపుతుందా?కలిపితే వాటిని సిఎం రేవంత్ రెడ్డి ఎదుర్కోగలరా? రాబోయే రోజుల్లో సమాధానం లభిస్తుంది.
Tollywood’s December release race is getting more interesting, with Nithiin’s Alias Rukmini joining the December…
Vijay’s son Jason Sanjay chose to make his entry into films as a director rather…