
ఎన్నికల తరువాత గుంటూరులో 500 కోట్లతో పెద్ద స్టూడియో కట్టబోతున్నట్టు కోన ప్రకటించడం మరింత సంచలనం సృష్టించింది. ఆయన అధికార పార్టీ నేతల బినామీ అంటూ కొంత మంది విమర్శించారు. ఆ వివాదం ముగిసిపోక ముందే… మరో వివాదానికి కేంద్రబిందువయ్యారు ఆయన. కోన మీద పై జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్‌లో చీటింగ్ కేసు నమోదైంది.
ఒక సినిమాకు కథ ఇస్తానని చెప్పి 2017లో రూ.13.50 లక్షలు తీసుకుని కథ ఇవ్వకుండా, డబ్బులు అడిగితే బెదిరిస్తున్నారని జెమినీ ఎఫ్‌ఎక్స్ డైరెక్టర్ ప్రసాద్ ఫిర్యాదు చేశారు. ఈ మేరకు జూబ్లీహిల్స్ పోలీసులు కోన వెంకట్‌పై 406, 420 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఇటీవలే కాలంలో కోనా రచనతో పాటు చిత్రనిర్మాణంలోకి కూడా ప్రవేశించారు.
వివిధ ప్రాజెక్టులతో ఆయన బిజీగా ఉండటం వల్లే కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చిందని, ఈ వివాదాన్ని సామరస్యంగా పరిష్కరించుకుంటాం అని కోన దగ్గరి వారు అంటున్నారు. అయితే గతంలో పవన్ కళ్యాణ్ మీద చేసిన వివాదాస్పద వ్యాఖ్యల వల్ల కోన మీద మెగా అభిమానులు సోషల్ మీడియాలో ఈ వార్తతో విరుచుకుపడుతున్నారు.
Suriya’s long delayed project Karuppu, directed by RJ Balaji, is finally set for a worldwide…
One issue becoming impossible to ignore in the cinema industry is the growing fear surrounding…