‘నిహారిక’ వెంట పడుతున్న ‘యువహీరో’

konidella niharika oka manassuమెగా తనయురాలు నిహారిక తొలి సినిమా “ఒక మనసు” ఫస్ట్ లుక్ విడుదలైంది. మహాశివరాత్రి శుభాకాంక్షలు చెప్తూ విడుదలైన ఈ పోస్టర్ లో యువహీరో నాగశౌర్య మెగా తనయురాలు నిహారిక వెంటపడుతూ దర్శనమిచ్చారు. పెయింటింగ్ మాదిరి కనపడుతున్న ఈ ఫోటో ఆహ్లాదకరంగా ఉందనే ప్రశంసలు అందుకుంటోంది.

ADVERTISEMENT

ఫీల్ గుడ్ చిత్రంగా రాబోతున్న ఈ సినిమాకు ‘మల్లెల తీరంలో సిరిమల్లె పువ్వు’ చిత్ర దర్శకుడు రామరాజు దర్శకత్వం వహించగా, మధుర శ్రీధర్ రెడ్డి సమర్పించనున్నారు. ఇప్పటికే సినిమా షూటింగ్ మొత్తం పూర్తి కాగా, వేసవి కానుకగా ఏప్రిల్ లో ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తోంది.

ADVERTISEMENT
Latest Stories