
“ఒక సినిమా విజయవంతం కావాలంటే అన్ని డిపార్ట్మెంట్స్ పర్ ఫెక్ట్ గా ఉండాలని, ‘జయమ్ము నిశ్చయమ్మురా’ సినిమా విషయంలో తనకు అది కనపడుతోందని, అది ఖచ్చితంగా విజయవంతం అవుతుందని” అన్న కొరటాల, తన ‘జనతా గ్యారేజ్’ సినిమాలో కొన్ని లోపాలు ఉన్నాయని, అన్ని క్రాఫ్ట్స్ సరిగా కుదరలేదని అన్నారు. ‘జయమ్ము నిశ్చయమ్మురా’ సినిమా గురించి చెప్తూ చెప్తూ… తన సినిమాలోని లోపాలను ఒప్పుకున్న ఇదే కొరటాల, సినిమా రిలీజ్ అయిన సమయంలో మాత్రం రివ్యూలపై పెదవి విరిచిన విషయం తెలిసిందే.
తానూ దర్శకత్వం వహించిన మూడు సినిమాలలో “జనతా గ్యారేజ్” బెస్ట్ అని అప్పుడు చెప్పిన కొరటాల, అందులో బొక్కలున్నాయని ఇప్పుడు చెప్పారు. అయితే హీరోల, దర్శకుల మాటలను గుడ్డిగా నమ్మే అభిమానులకు మాత్రం ప్రస్తుతం కొరటాల చేసిన వ్యాఖ్యలు రుచించడం లేదు. ముఖ్యంగా రాక రాక ఒక బ్లాక్ బస్టర్ అందుకున్న ‘యంగ్ టైగర్’ ఫ్యాన్స్ మాత్రం మండిపడుతున్నారు. అయితే “జయమ్ము నిశ్చయమ్మురా” మాత్రం అద్భుతంగా ఉందని స్పష్టత ఇచ్చారు కొరటాల.
చిత్రం: రంభ ఊర్వశి మేనక M9 రేటింగ్: 1.5/5 విడుదల తేదీ: సెప్టెంబర్ 04, 2026 తారాగణం: అల్లరి నరేష్,…
Megastar Chiranjeevi’s Vishwambhara is making steady progress on the post-production front, with music director Gaur…