Telugu

నయా ట్రెండ్… నరికేయ్… కలెక్షన్స్ కొట్టేయ్..!

బాక్సాఫీస్ వద్ద రికార్డులు తిరిగరాయాలా? అయితే సింపుల్… ఓ బ్లడ్ బాత్ కంటెంట్ తో కూడిన కధను రెడీ చేసి సరిగ్గా సిల్వర్ స్క్రీన్ పైన ప్రజెంట్ చేస్తే చాలు… ప్రేక్షకులు కనకవర్షం కురిపిస్తారు… అన్న తరహాలో రాబోయే టాప్ హీరోల సినిమాలు నిలవనున్నాయి. తాజాగా విడుదలైన కొరటాల శివ – జూనియర్ ఎన్టీఆర్ ల “దేవర” గ్లిమ్ప్స్ కూడా ఈ జాబితాలోనే నిలవనుంది.

నిజానికి “దేవర” మొదలైన నాటి నుండి ‘బ్లడ్ బాత్’ అన్న పబ్లిసిటీని చిత్ర యూనిట్ ముందుగానే ఇవ్వగా, నేడు ఓ శాంపిల్ ను పరిచయం చేసారు. అనిరుధ్ బ్యాక్ గ్రౌండ్, విఎఫ్ఎక్స్ విజువల్స్ అండ్ తారక్ ఆకట్టుకోగా, బ్లడ్ తో అర్ధ చంద్రుడిని కాస్త పూర్ణ చంద్రుడిగా మార్చిన వైనం సోషల్ మీడియాలో వైరల్ అయ్యేలా చేసింది.

ADVERTISEMENT

ఈ విషయంలో ఒక్క “దేవర”నే కాదు, ఇటీవల బాక్సాఫీస్ ను కుదిపేసిన “సలార్”లో బ్లడ్ బాత్ షాట్స్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ‘కాటేరమ్మ కొడుకు’లో ప్రభాస్ సృష్టించిన విధ్వంసం, అలాగే క్లైమాక్స్ లో ‘ఖాన్ సార్’ను ఎరుపెక్కించిన వైనాన్ని ప్రేక్షకులు నెత్తిన పెట్టుకున్నారు. దీంతో “సలార్ 2″లో ఇంకెంత బ్లడ్ బాత్ ఉండనుందో అన్న అంచనాలు ఇప్పటికే తారాస్థాయికి చేరుకున్నాయి.

అలాగే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తోన్న “ఓజీ” గ్లిమ్ప్స్ అంతా కూడా ‘బ్లడ్ బాత్’ అని గుర్తు చేసుకోకతప్పదు. చికెన్ ముక్క కొట్టినంత తేలికగా పవన్ కళ్యాణ్ ఒకరి చేతిని నరికి ఎక్వేరియంలో పడేసిన షాట్స్ సోషల్ మీడియాలో హల్చల్ చేసిన సంగతి తెలిసిందే. “కేజీఎఫ్”తో మొదలైన ఈ తరహా బ్లడ్ బాత్, ప్రస్తుతం నయా ట్రెండ్ గా మారింది.

స్టార్ హీరోలు వెండితెరపై ఎంతగా ‘బ్లడ్ బాత్’ సృష్టిస్తే అంతగా కలెక్షన్స్ వస్తాయనే దృక్పధంతో దర్శకులు ఈ తరహా కధలకు శ్రీకారం చుడుతున్నారో లేక మన స్టార్ హీరోలు అలాంటి కధలకు ప్రాధాన్యత ఇస్తున్నారో గానీ, రాబోయే ఒకటి, రెండు సంవత్సరాలలో మన స్టార్ హీరోలు సిల్వర్ స్క్రీన్ పై నరికివేతలో బిజీగా ఉండబోతున్నారని మాత్రం స్పష్టమవుతోంది.

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

డీఎస్సీపై సీబీఐ విచారణ కావాలి.. కానీ ఈ కేసుల్లో వద్దా?

ఏపీ మెగా డీఎస్సీలో అవకతవకలు జరిగాయని, వాటిపై సీబీఐ చేత విచారణ జరిపించాలంటూ రాష్ట్రంలో వైసీపీ చేసిన హడావుడి అందరూ…

2 minutes ago

President Murmu: Women to Help Make India Developed by 2047

President Droupadi Murmu inaugurated the National Saras Mela at Punnami Ghat in Vijayawada. She said…

12 minutes ago