Telugu

డీఎస్సీపై సీబీఐ విచారణ కావాలి.. కానీ ఈ కేసుల్లో వద్దా?

ఏపీ మెగా డీఎస్సీలో అవకతవకలు జరిగాయని, వాటిపై సీబీఐ చేత విచారణ జరిపించాలంటూ రాష్ట్రంలో వైసీపీ చేసిన హడావుడి అందరూ చూశారు.

అంతకు ముందు కూడా కొన్ని సందర్భాలలో సీబీఐ చేత విచారణ జరిపించాలని వైసీపీ పట్టుబట్టింది. కనుక సీబీఐపై వైసీపీకి నమ్మకం ఉందని స్పష్టమవుతోంది.

ADVERTISEMENT

అయితే ఈ నమ్మకం కూటమి ప్రభుత్వంతో ముడిపడిన అంశాల విషయంలోనే తప్ప సొంత కేసులకు కాదని అక్రమాస్తుల కేసులు, వివేకా హత్య కేసులో వైసీపీ వాదనలతో నిరూపించిచూపింది.

అయితే మాట తప్పడం మడమ తిప్పడం బొత్తిగా అలవాటు లేని కారణంగా ఈ ద్వంద వైఖరికి వైసీపీ గట్టిగా కట్టుబడి ద్విపాత్రాభినయం చేస్తూనే ఉంది.

డీఎస్సీలో సీబీఐ కోసం అంతగా పట్టుబట్టిన వైసీపీ ఇప్పుడు అక్రమాస్తుల కేసులు, వివేకా హత్య కేసులో సీబీఐ విచారణను తప్పు పడుతోంది.

ఈ రెండు కేసుల విచారణ వేగవంతం అవడంతో కేంద్ర ప్రభుత్వం వాటిని దుర్వినియోగం చేస్తోందని ఒక్క ముక్కలో వైసీపీ సొంత మీడియా తేల్చి పడేసింది.

అలాగే సీబీఐ, ఈడీ రెండూ కూడా చంద్రబాబు నాయుడు ఎవరిని వేదించమని ఆదేశిస్తే వారిని వేదిస్తున్నాయని ఆరోపించింది. ఇప్పుడు అయన వాటిని వైసీపీ నేతలపైకి ఉసిగొల్పడంతో అవి ‘దిక్కుమాలిన కేసుల’ విచారణ పేరుతో వేధిస్తున్నాయని ఆరోపించింది.

సిఎం చంద్రబాబు నాయుడుకి నిజంగానే సీబీఐ, ఈడీలపై అంత పట్టు ఉంటే, ఈవిధంగా వైసీపీ ఆయనను వేలెత్తి చూపగలిగేదా?అసలు రాష్ట్రంలో రాజకీయాలు చేయగలిగి ఉండేదా?అంబటి రాంబాబు నడిరోడ్డుపై మీడియా సమక్షంలో ఆయనను బూతులు తిట్టగలిగేవారా?

కానీ సీబీఐ, ఈడీలను చంద్రబాబు నాయుడుతో ముడిపెట్టేసి సొంత పత్రికలో వ్రాసుకునే ఈ కథల పరమార్ధం ఏమిటి? అని ఆలోచిస్తే, ఒకవేళ వీటిలో ఏదైనా కేసులో వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అయ్యి, మళ్ళీ జైలుకి వెళ్ళాల్సివస్తే అందుకు సిఎం చంద్రబాబు నాయుడే కారణమని ప్రజలను నమ్మించడం. తద్వారా సానుభూతి పొంది వచ్చే ఎన్నికలలో ఘన విజయం సాధించడ వచ్చని కావచ్చు.

ఇదివరకు చంద్రబాబు నాయుడుని జగన్‌ ప్రభుత్వం అరెస్టు చేసి జైలులో పెట్టించినప్పుడు, ఇలాగే జరిగింది కనుక ఒకవేళ ఈ కేసులలో జగన్‌ అరెస్ట్ అయితే ఇప్పుడూ అలాగే జరుగుతుందనే ఆశ కావచ్చు.

కానీ అక్రమాస్తులు, వివేకా హత్య కేసుకు జగన్‌ ప్రభుత్వం పెట్టిన ‘స్కిల్ డెవలప్‌మెంట్‌’ కేసుకి నక్కకీ నాగలోకానికి ఉన్నంత తేడా ఉందనే విషయం మరిచిపోతే ఎలా?

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

President Murmu: Women to Help Make India Developed by 2047

President Droupadi Murmu inaugurated the National Saras Mela at Punnami Ghat in Vijayawada. She said…

12 minutes ago

Catherine Tresa Has a Different Take on the Heroine Label

Actresses are often expected to fit a certain image, and their roles are judged based…

42 minutes ago