తెలంగాణ రాజకీయాలకు రివర్స్ గేర్?

తెలంగాణలో కాంగ్రెస్‌, బిఆర్ఎస్ పార్టీల మద్య సాగుతున్న రాజకీయ ఆధిపత్యపోరులో ఇంతకాలం రెండు పార్టీలు దాదాపు సమ ఉజ్జీలుగానే సాగాయి. కానీ ఇప్పుడు హెచ్‌సీయూ భూవివాదంతో బిఆర్ఎస్ పార్టీ పైచేయి సాధించి, రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని దెబ్బతీసేందుకు సిద్దంఅవుతోంది.

సిఎం రేవంత్ రెడ్డి హెచ్‌సీయూ భూముల పేరుతో రూ.10,000 కోట్ల కుంభకోణానికి పాల్పడ్డారని బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ సంచలన ఆరోపణలు చేశారు. ఆయన చేసిన ఆరోపణలు టూకీగా చెప్పుకుంటే..

ADVERTISEMENT

· హెచ్‌సీయూ భూములు ప్రభుత్వానివి కావు. ఆ 400 ఎకరాలు ప్రభుత్వ భూములని నిర్ధారించే పత్రాలు ఏవీ ప్రభుత్వం వద్ద లేవు.

· అటవీ భూములలో ఎటువంటి తనఖాలు, అమ్మకాలు, వేలంపాటలు చేయరాదని సుప్రీంకోర్టు పలు సందర్భాలలో స్పష్టంగా చెప్పింది.

· కానీ వాటి విలువ ఎకరానికి రూ.75 కోట్లని, అవి ప్రభుత్వ భూములని చెప్పి ఐసిఐసియూ బ్యాంకు వద్ద వాటిని తనఖా పెట్టి రూ.10,000 కోట్లు అప్పు తీసుకున్నారు.

· ఆ బ్యాంక్ ఎందుకు అప్పు ఇచ్చింది. ఆ ఇచ్చిన రూ.10,000 కోట్లు ఎక్కడికి పోయాయి?

· ఈ భూభాగోతంలో ఓ బీజేపి ఎంపీ కూడా ఉన్నారు. ఆయనే సిఎం రేవంత్ రెడ్డికి ఓ బ్రోకరేజ్ కంపెనీని పరిచయం చేసి దాని ద్వారా ఆ భూములను అమ్మేసేందుకు ప్లాన్ చేశారు.

· ఈ వ్యవహారంలో రూ.169 కోట్లు బ్రోకరేజ్ కంపెనీకి కమీషన్‌గా చెల్లించారు.

· ఇదంతా ప్రధాని మోడీకి, బీజేపి పెద్దలకు తెలియకుండా జరిగింది.

త్వరలోనే పూర్తి సాక్ష్యాధారాలతో ప్రధాని మోడీ, కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్, రిజర్వ్ బ్యాంక్ గవర్నర్‌కి, సీబీఐకి పిర్యాదు చేస్తాం. సీబీఐ దర్యాప్తు కోరుతాం. ఒకవేళ కేంద్రం పట్టించుకోకపోతే సుప్రీంకోర్టులో కేసు వేసి న్యాయపోరాటం చేస్తాం,” అని బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ హెచ్చరించారు.

హెచ్‌సీయూ భూములని ఐసిఐసియూ బ్యాంకు వద్ద తాకట్టు పెట్టి రూ.10,000 కోట్లు తీసుకుందని, కానీ వాటిని వేలంవేసి అమ్ముకునేందుకుగాను తెలంగాణ ప్రభుత్వం ఆ బ్యాంకు సూచన మేరకు రూ.5,000 కోట్లు సెక్యూరిటీ డిపాజిట్ రూపంలో జమా చేసిన్నట్లు లేదా చేయబోతున్నట్లు ఇటీవల మీడియాలో వార్తలు వచ్చాయి.

కేటీఆర్‌ కూడా అదే చెపుతున్నారిప్పుడు. కనుక ఈ వ్యవహారంలో తెలంగాణ సిఎం రేవంత్ రెడ్డి, బీజేపి ఎంపీ ఇద్దరూ చిక్కుకుంటే, తెలంగాణ రాజకీయాలలో అనూహ్యమైన మార్పులు జరిగే అవకాశం ఉంది.

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

సుప్రీం తీర్పుపై సిఎం స్పందన…పెర్ఫెక్ట్

ఏపీ స్థానిక సంస్థల ఎన్నికలలో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు ఇవ్వడం కుదరదంటూ సుప్రీంకోర్టు తీర్పు చెప్పిన నేపధ్యంలో సిఎం…

2 minutes ago

Bowling Like His Prime Days: Still Out! Selection Bias

Mohammed Shami is still hoping for another chance to play for Team India, and his…

24 minutes ago