
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో తెలంగాణ పేరు వినపడదు కానీ తెలంగాణ రాజకీయాలలో మాత్రం నిత్యం ఎదో ఒక మూలా ఎదో ఒక రూపంలో ఆంధ్రా అనే పేరు వినిపించాల్సిందే. ఏపీ వాళ్ళు అలా ఆంధ్రోళ్లు ఇలా అంటూ అటు కాంగ్రెస్ నుంచి ఇటు బిఆర్ఎస్, టిఆర్ఎస్ వరకు అన్ని పార్టీలు, అన్ని పార్టీల నేతలు ఏపీ కేంద్రంగా రాజకీయాలు చెయ్యాల్సిందే, తద్వారా వచ్చే రాజకీయ లబ్ది పొందాల్సిందే అన్నట్టుగా ముందుకెళుతున్నారు.
ఏపీ – తెలంగాణ రెండు రాష్ట్రాలుగా విడిపోయి పుష్కర కాలం గడిచిపోయినా ఇప్పటికి తెలంగాణ రాజకీయ పార్టీలకు క్షేత్ర స్థాయిలో రాజకీయ మనుగడ కొనసాగాలి అంటే ఏపీ పేరు మీద ప్రాంతీయవాద రాజకీయాలు సాగాల్సిందే. ఆ దిశగా ప్రజలను రెచ్చకొట్టాల్సిందే. ఇందులో అన్ని రాజకీయ పార్టీలు కూడా ఒకరి మీద ఒకరు పోటీ పడి మరి ఏపీ మీద బురద జల్లుతూనే ఉంటారు.
అయితే ఈ తరహా రాజకీయానికి అంకురార్పణ చేసిన బిఆర్ఎస్ ఈ విషయంలో ఎప్పుడు మొదటి స్థానంలోనే ఉంటుంది. తెలంగాణ కు వరదలొచ్చినా, తెలంగాణ కు నీటి కరువు ఏర్పడినా అందుకు ఏపీ నే కారణం, అక్కడి ప్రభుత్వ పెద్దలే దోషులు అంటూ మీడియా ముందుకొచ్చేస్తారు.
అయితే ఆంధ్రా లో టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉంటేనే బిఆర్ఎస్ కు ఈ తరహా రాజకీయం గుర్తుకొస్తుంది. ఏపీలో నిర్మించే పోలవరం ప్రాజెక్ట్ పూర్తయితే తెలంగాణలో ఉండే భద్రాద్రి మునిగిపోతుందంటూ వాదిస్తారు, అలాగే తెలంగాణ ప్రాజెక్టులలో నీటి కొరత ఏర్పడితే ఆంధ్రా ప్రభుత్వం అక్రమంగా తెలంగాణ నీటిని తోడేస్తుంది అంటూ ఆరోపిస్తారు.
ఇక ఇందుకోసం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ ని ఏపీ సీఎం బాబు కి శిష్యుడిగా మార్చేశారు. గురు దక్షిణ కోసమే రేవంత్ తెలంగాణ రైతులకు అన్యాయం చేస్తూ తెలంగాణ నీటి వాటాలను ఏపీకి వదిలిపెడుతున్నారు అంటూ ఆధారాలు లేని ఆరోపణలు చేస్తారు.
తెలంగాణ లో తమ ప్రత్యర్థి పార్టీ నేతను టార్గెట్ చేయడానికి కూడా బిఆర్ఎస్ ఏపీ అధికార టీడీపీ పార్టీ మీదే ఆధారపడుతుంది. బాబు ఆదేశాలతోనే రేవంత్ పాలన అంటూ ఒకసారి, గురువు గారి కళ్ళలో ఆనందం కోసమే చిట్టి నాయుడి తపన అంటూ మరోసారి,
ఇలా కేటీఆర్ తెలంగాణ ప్రభుత్వ వైఫల్యాలను విమర్శించేందుకు, ఏపీ ప్రభుత్వ ముందాలోచనలను ప్రశంసించేందుకు, గత ప్రభుత్వ తప్పిదాలను కప్పిపుచ్చేందుకు కూడా తెలంగాణ – ఏపీ అంటూ రెండు రాష్ట్రాల మధ్య రాజకీయ విద్వేషాలు సృష్టించేందుకు వెనుకాడరు.
అయితే రేవంత్ రెడ్డి ని బాబు శిష్యుడు అంటూ అభివర్ణిస్తున్న కేటీఆర్ గతంలో జగన్ – కేసీఆర్ ల మధ్య ఏర్పడిన బంధాన్ని, వైసీపీ – బిఆర్ఎస్ మధ్య ముడిపడిన అనుబంధాన్ని ఏ పేరుతో వర్ణిస్తారు.? గత వైసీపీ హయాంలో తెలంగాణలోని ఏపీ ఆస్తులన్నీ కూడా కేసీఆర్, నాటి సీఎం జగన్ ఒకేఒక్క సంతకంతో చేజిక్కించుకున్నారు.
మరి అప్పుడు కేసీఆర్ చేతిలో జగన్ కీలుబొమ్మా .? అలాగే నాడు జగన్ గెలుపు కోసం టీడీపీ కి రిటర్న్ గిఫ్ట్ ఇచ్చేందుకు సిద్ధమైన కేసీఆర్ జగన్ కు మార్గదర్శకుడిగా మారాడా.? నాడు జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్ప్పుడు బిఆర్ఎస్ నేతలకు ఏపీ తో ఏపీ నేతలతో లేని సమస్యలు కేవలం బాబు ముఖ్యమంత్రి అవ్వగానే ఎందుకు తెరమీదకోస్తున్నాయి.?
ఇందుకు బిఆర్ఎస్ కి వైసీపీ కి మధ్య ఉన్న ఆ రాజకీయ బంధం పేరేమిటి.? జగన్ కి కేసీఆర్ కి ఉన్న అనుబంధం సంగతేంటి.? అనేది కేటీఆర్ చెప్పగలరా.? చెప్పి ఇరు రాష్ట్రాల ప్రజలను మెప్పించగలరా.?
Vijay Sethupathi's Baththa directed by Balaji Tharaneetharan and produced by Atlee, was released in theatres…
“Chi deenamma… akkada vaalaki Dorothylu, Baththalu, Modha Rathrilu, Bethalahem Kudumba Unit lu. Manakemo Peddilu, Paradiselu,…