Telugu

కేటీఆర్‌ ఎంత తెలివి ప్రదర్శించినా…

ఫార్ములా 1 రేసింగ్ కేసులో ఏ-1 నిందితుడు ఉన్న బిఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్‌ సోమవారం ఏసీబీ విచారణకని వచ్చి తెలివిగా కోర్టులో కేసు ఉందని చెప్పి విచారణకు హాజరుకాకుండా వెళ్ళిపోయారు. ఏ క్షణంలోనైనా కోర్టు తీర్పు వెలువడుతుంది కనుక అంత వరకు తన జోలికి రావద్దని చెప్పారు కూడా.

ఆయన చెప్పిన్నట్లే ఈరోజు తెలంగాణ హైకోర్టు తీర్పు ప్రకటించింది. ఈ కేసుని కొట్టివేయాలని కోరుతూ ఆయన వేసిన క్వాష్ పిటిషన్నే హైకోర్టు కొట్టివేసింది. ముందస్తు బెయిల్‌ పొడిగించలేదు. కనుక ఏ క్షణంలోనైనా ఆయనని ఏసీబీ పోలీసులు అరెస్ట్‌ చేసే అవకాశం ఉంది. హైకోర్టులో ఎదురుదెబ్బ తగలడంతో ఆయన న్యాయవాదులు నేడే సుప్రీంకోర్టులో హైకోర్టు తీర్పుని సవాలు చేస్తూ పిటిషన్‌ వేసేందుకు సిద్దమవుతున్నారు.

ADVERTISEMENT

సుప్రీంకోర్టు ఈ కేసు విచారణకు ఎలాగూ స్వీకరిస్తుంది. కానీ తక్షణమే విచారణ జరిపి ముందస్తు బెయిల్‌ ఇస్తుందో లేదో తెలీదు. కనుక సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకునేలోగానే ఏసీబీ లేదా ఈడీ కేటీఆర్‌ని అరెస్ట్‌ చేసే అవకాశం కనిపిస్తోంది.

బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా వ్యవహరిస్తున్న కేటీఆర్‌ అరెస్ట్‌ అనివార్యంగా కనిపిస్తుండటంతో ఆయన జైలుకి వెళితే బిఆర్ఎస్ పార్టీని ఎవరూ నడిపించాలనే దానిపై అప్పుడే కేసీఆర్‌ ఫామ్‌హౌస్‌లో చర్చిస్తున్నట్లు తెలుస్తోంది.

సంక్రాంతి తర్వాత కేసీఆర్‌ బయటకు వస్తారని కేటీఆర్‌, హరీష్ రావు తదితరులు చెప్పుకున్నప్పటికీ, కొడుకు అరెస్టుతో ఆయన ఇంకా క్రుంగిపోవచ్చు కనుక బయటకు రాకపోవచ్చు. కనుక హరీష్ రావు లేదా కల్వకుంట్ల కవితలలో ఎవరో ఒకరికి పార్టీ బాధ్యతలు అప్పగిస్తారేమో?

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

Pics: Anukreethy Turns Casual Denim Into Pure Glam

Anukreethy Vas makes a simple lace and denim pairing feel like a proper fashion moment.…

17 minutes ago

Vijay-Modi’s Metro Ride Turns Generational Meme Content?

Today, Prime Minister Narendra Modi inaugurated the Vadapalani to Poonamallee stretch of the Phase 2…

46 minutes ago