
“కనుక ఏపీలో గుంటూరు బాగుంది…. విజయవాడ కూడా బాగుంది. విశాఖపట్నం కూడా చాలా బాగుంది. ఏపీలో అన్నీ చాలా బాగున్నాయి… అంతే,” అని ముసిముసినవ్వులు నవ్వుతూ అన్నారు. ఇంతకు మించి ఏపీ గురించి నేనేమీ మాట్లాడనని మంత్రి కేటీఆర్ అన్నారు. కానీ ఏమీ మాట్లాడను అంటూనే కేటీఆర్ చెప్పదలచినది ముసిముసినవ్వులతో చెప్పేశారు.
ఏపీలో ఈ ప్రధాన నగరాలలో పరిస్థితిలో పెద్దగా మార్పు లేదనే విషయం అందరికీ తెలుసు. రాష్ట్రంలో గుంతలు పడిన రోడ్లను మరమత్తులు చేయాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తుండటం, రోడ్ల మరమత్తులే చేయించలేని ప్రభుత్వం మూడు రాజధానులు ఏం ఏర్పాటు చేయగలదని ప్రతిపక్షాలు దెప్పిపొడుస్తుండటం అందరూ వింటూనే ఉన్నారు.
కనుక ముంజేతి కంకణం చూసుకొనేందుకు మళ్ళీ అద్దం ఎందుకన్నట్లు, అందరికీ తెలిసిన ఏపీలో పరిస్థితుల గురించి మళ్ళీ ప్రత్యేకంగా చెప్పుకోవడం ఎందుకు?అని కేటీఆర్ చెప్పిన్నట్లు అర్దమవుతోంది.
అమరావతి నిర్మాణపనులను నిలిపివేసి మూడు రాజధానులపేరుతో ఏమీ చేయకుండా నాలుగేళ్ళు కాలక్షేపం చేసేసినప్పుడు, ఎవరైనా ఇలాగే వేలెత్తి ఎద్దేవా చేస్తుంటారు. అలాగని ఉక్రోషంతో ఎదురుదాడి చేస్తే తెలంగాణ మంత్రులు నోరు విప్పితే మన పరువే పోతుంది కనుక కేటీఆర్ చేసిన ఈ వ్యాఖ్యలు వినబడనట్లు ఊరుకోవడమే మంచిది.
Ranabaali has been facing criticism over its background score since its release. Starring Vijay Deverakonda…
స్థానిక సంస్థల ఎన్నికలంటే అధికార, ప్రతిపక్ష పార్టీలకు, పోటీ చేస్తున్న అభ్యర్ధులకే పరిమితం అనుకునే రోజులు కావివి. ఈ చెత్త…