Telugu

పవన్ పై కేటీఆర్ వ్యాఖ్యలు…!

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏపీ డిప్యూటీ సీఎం పదవి పై బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు పరిశీలిస్తే కేసీఆర్ సంతానం పవన్ కళ్యాణ్ రాజకీయ ప్రయాణాన్ని ఇంత తక్కువగా అంచనా వేసారా అనిపిస్తుంది.

మొన్న ఓ మీడియా ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్ వ్యూ లో కవిత మాట్లాడుతూ పవన్ ఏపీకి డిప్యూటీ సీఎం అవ్వడం ఆంధ్రా ప్రజల దురదృష్టమని, అది అనుకోకుండా జరిగిపోయిన ఒక సంఘంటగానే భావించాలని, పవన్ ను ఒక సీరియస్ పొలిటిషన్ తానూ పరిగణించబోను అంటూ చేసిన వ్యాఖ్యలు పవన్ అభిమానులతో పాటుగా కూటమి మద్దతుదారులకు కూడా ఆగ్రహాన్ని తెచ్చించాయి.

ADVERTISEMENT

దీనితో కవిత పై అటు సోషల్ మీడియాలో జనసైనికులు విరుచుకుపడ్డారు. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో అరెస్టయి జైలుకెళ్లోచ్చిన వ్యక్తులు సైతం పవన్ పై అనుచిత వ్యాఖ్యలా అంటూ కవిత పై మండిపడ్డారు పవన్ అభిమానులు. అలాగే ఇటు తెలంగాణ బీజేపీ నాయకులు సైతం పవన్ పై కవిత చేసిన వ్యాఖ్యలను తప్పుబడుతూ ఆమె పై కౌంటర్ అటాక్ కు సిద్ధమయ్యారు.

ఈ నేపథ్యంలో తాజాగా కేసీఆర్ కుమారుడు కేటీఆర్ కూడా పవన్ డిప్యూటీ సీఎం పదవి పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. పవన్ రాజకీయాలలో తానూ ఉహించినదానికి కంటే ఉన్నత స్థాయికి ఎదిగారంటూ చెప్పుకొచ్చారు. అయితే కేటీఆర్ దృష్టిలో పవన్ స్థాయి అంటే ఏంటి.? ఊహకు మించి అంటే పవన్ ఇప్పుడు ఉన్న స్థాయే ఆయనకు చాల ఎక్కువని కేటీఆర్ భావిస్తున్నారా.?

ప్రశ్నిస్తాను అంటూ పార్టీ పెట్టిన పవన్ ఎప్పటికి ప్రశ్నిస్తూనే ఉంటారని కేటీఆర్ ఆశించారా.? లేక తన తెరచాటు స్నేహితుడు జగన్ ఎప్పటికి ముఖ్యమంత్రి పదవి నుండి వైతొలగడని లెక్కకట్టారా.? వైసీపీ, బిఆర్ఎస్ జోడికి తిరుగుండదు అని ఆశించిన కేటీఆర్ ఆశలను పవన్ తన ఆవేశం, ఆలోచనతో తునాతునకలు చేస్తూ ఏపీలో కూటమి పొత్తుతో వైసీపీ ని పాతాళానికి తొక్కారు.

కేసీఆర్ కుటుంబానికి తెలంగాణలో బిఆర్ఎస్ ఓటమి కంటే ఏపీలో వైసీపీ ఓటమే ఎక్కువగా బాధించిందా అనేలా ప్రతిసారి ఎదో రూపంలో వీరు జగన్ మీద ఉన్న ప్రేమను, కూటమి నేతల మీద ఉన్న ద్వేషాన్ని బయటపెడుతూనే ఉన్నారు. ఈ నేపథ్యంలోనే చెల్లేమో పవన్ ఈ స్థాయికి రావడం ఆంధ్రా ప్రజలు దురదృష్టం అని, అన్నేమో పవన్ కు ఈ స్థాయే ఎక్కువ అని భావిస్తున్నారా.?

దీని బట్టి కేసీఆర్ కుటుంబం పవన్ ను రాజకీయంగా ఎంత తక్కువంచన వేసిందో అర్ధమవుతుంది. అయితే ఇటు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని ఉద్దేశిస్తూ రేవంత్ మంచి జాతకుడని, ఆయన గొప్ప అదృష్టవంతుడన్నారు. ఇక తన తండ్రి కేసీఆర్ ఒక కారణజన్ముడంటూ కొనియాడారు. అలాగే తనకు కేసీఆర్ కాకుండా పినరయి విజయన్ తనకు నచ్చిన ముఖ్యమంత్రి అంటూ చెప్పుకొచ్చారు.

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

December 4 Clash: Nithiin vs Naga Chaitanya

Tollywood’s December release race is getting more interesting, with Nithiin’s Alias Rukmini joining the December…

21 minutes ago

First Direction, Next Acting? Jason Sanjay in the Spotlight

Vijay’s son Jason Sanjay chose to make his entry into films as a director rather…

50 minutes ago