
2023 ఎన్నికలు తెలంగాణ రాజకీయాలలో ఊహించని మార్పులను తీసుకొచ్చినట్టే బిఆర్ఎస్ పార్టీలో కూడా ఊహకందని మార్పులను తీసుకొచ్చింది. 2023 ఎన్నికలకు ముందు ప్రాంతీయపార్టీగా ఉన్న తెరాస జాతీయ రాజకీయ స్ఫూర్తి తో భారతీయ రాష్ట్ర సమితిగా రూపం మార్చుకుంది.
దీనితో తెలంగాణ రాజకీయాల నుంచి తెరాస అస్తమించింది అని అందరు భావించారు. కానీ ఆ అస్తమించిన తెరాస కవిత రూపంలో మళ్ళీ తెలంగాణ రాజకీయాలలో ఉదయనించింది. కవిత ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో అరెస్టయ్యి తెలంగాణ రాజకీయాలకు దూరమైనా ఆ ఆరు మాసాల సమయం ఆమె రాజకీయ జీవితాన్ని పూర్తిగా మార్చేసింది.
నాటి నుంచి అంచెలంచెలుగా బిఆర్ఎస్ కు దూరం అవుతూ వస్తున్న కవిత చివరికి కల్వకుంట్ల కుటుంబం లో చీలికకు కారణమయ్యారు. బిఆర్ఎస్ నుంచి సస్పెన్షన్ వేటుతో బయటకొచ్చిన కవిత బిఆర్ఎస్ టార్గెట్ గా రాజకీయం మొదలుపెట్టింది. అందుకుగాను హరీష్ మొదలుకుని కేటీఆర్, కేసీఆర్ వరకు విమర్శలు గుప్పించింది.
హరీష్ ను గుంటనక్క గా అభివర్ణించిన కవిత కేసీఆర్ ని మరమనిషిగా పేర్కొంది. ఇక కేటీఆర్ కి నాయకత్వ లక్షణాలు లేవంటూ తేల్చి చెప్పింది. ఇలా జాగృతితో మొదలుపెట్టిన ఆమె కొత్త రాజకీయ ప్రయాణం చివరికి తెరాస దగ్గరకొచ్చింది. కేసీఆర్ వదులుకున్న తెరాస తోనే బిఆర్ఎస్ ను రాజకీయంగా దెబ్బతీయాలని కవిత తెలంగాణ రక్షణ సేన పేరుతో బిఆర్ఎస్ కు పక్కలో బల్లెంగా మారేందుకు సిద్డమయ్యింది.
ఇక బిఆర్ఎస్ పరిస్థితి ఇలా ఉంటే ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు హారిష్ గండం తప్పదు అంటూ ఇప్పటికే కాంగ్రెస్, బీజేపీ మొదలుకుని కవిత వరకు పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తున్నారు. బిఆర్ఎస్ పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా కేసీఆర్ కేటీఆర్ ని ప్రకటించిన మరుక్షణమే బిఆర్ఎస్ పార్టీ రెండు ముక్కలుగా చీలడం ఖాయం అంటూ కుండబడ్దలు కొడుతున్నారు కాంగ్రెస్, బీజేపీ నేతలు.
ఆ భయంతోనే కేసీఆర్ ఇప్పటికి కేటీఆర్ కి పార్టీ పూర్తి బాధ్యతలు అప్పగించలేకపోతున్నారని, బిఆర్ఎస్ ను రాజకీయంగా దెబ్బకొట్టేందుకు కుమార్తె కవిత తెరాస తో కాచుకుని కూర్చున్నట్టే కేటీఆర్ రాజకీయ ఎదుగుదలను అడ్డుకునేందుకు హరీష్ కూడా సమయం కోసం వేచిచుస్తున్నారు అనేది తెలంగాణ రాజకీయాలలో విస్తృతంగా ప్రచారం జరుగుతుంది.
మరి కేసీఆర్ కుమార్తె కవిత తెరాస నుంచి తన పార్టీ బిఆర్ఎస్ ను రాజకీయంగా కాపాడుకుంటారా.? అలాగే మేనల్లుడు హరీష్ రాజకీయం నుంచి తనయుడు కేటీఆర్ రాజకీయ భవిష్యత్ కి భరోసా ఇవ్వగలరా.?
The makers of the 2018 youth entertainer ‘Husharu’ have officially announced its sequel, ‘Husharu 2’.…
Ajay Devgn’s Drishyam: The Conclusion is doing wonders at the box office. The movie has…